Ad Code

ఒకే ప్రాసెసర్‌తో Redmi 10, Realme 9i స్మార్ట్‌ఫోన్లు!


రెడ్‌మీ 10 సిరీస్‌లో ఇండియాలో రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది. గతంలో రిలీజైన రియల్‌మీ 9ఐ (Realme 9i) మోడల్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. దీంతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య పోటీ తప్పదు. అయితే రెడ్‌మీ 10 మొబైల్ రూ.10,000 బడ్జెట్‌లో లభిస్తే, రియల్‌మీ 9ఐ రూ.15,000 లోపు ధరలో రిలీజైంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు చూస్తే రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్, 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటే, రియల్‌మీ 9ఐ మోడల్‌లో 50మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్, 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. కెమెరా విషయంలో రియల్‌మీ 9ఐ మొబైల్‌ది పైచేయి. రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటే, రియల్‌మీ 9ఐ మోడల్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. బ్యాటరీ విషయంలో రెడ్‌మీ 10 స్మార్ట్‌ఫోన్‌ది పైచేయి. కానీ రియల్‌మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌కు 33వాట్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ధర విషయానికి వస్తే రెడ్‌మీ 10 ధర తక్కువగా ఉంది. రియల్‌మీ 9ఐ మోడల్‌లో ఫీచర్స్ కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధర కూడా ఎక్కువగానే ఉంది.

Post a Comment

0 Comments

Close Menu