Ad Code

రెడ్‌మి నుంచి 10 ఏ స్మార్ట్ ఫోన్ విడుదల !


చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ ఈరోజు విడుదలైంది.  ఇండియాలో సరసమైన ధరకే అందుబాటులోకి రానుంది. నెల క్రితమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో రిలీజ్ అయింది. Redmi 10A బడ్జెట్ ఫోన్.. ఇప్పటికే Amazon వెబ్‌సైట్‌లో లిస్టు అయింది. వాటర్డ్ డౌన్ వెర్షన్‌గా రానుంది. MediaTek Helio G25 ప్రాసెసర్, 13-MP ప్రైమరీ కెమెరాతో పాటు ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోంది. Redmi 10A బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో ఏయే ఫీచర్లు ఉన్నాయి. చైనాలో  Redmi 10A చైనాలో (4GB RAM + 64GB), 4GB RAM + 128GB, 6GB RAM + 128GB వేరియంట్‌లతో సహా మొత్తం 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.  Redmi 10A (4GB+64GB) స్టోరేజ్ వేరియంట్ రూ.9999 ప్రారంభ ధర ఉండనున్నట్టు అంచనా. 3GB RAM+32GB స్టోరేజ్ తో వచ్చే బేస్ వేరియంట్ ధర దాదాపు రూ.8,999గా ఉంటుందని అంచనా. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయిన వెంటనే ఫైనల్ ధర ఎంత ఉండొచ్చు అనేది రివీల్ కానుంది. Redmi 10A బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. 720×1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.53-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Helio G25 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. ఇందులో స్టోరేజీ పెంచుకునే ఫెసిలి టీ ఉండకపోవచ్చు. ఇక Redmi 10A స్మార్ట్ ఫోన్.. Android 11 ఆధారిత MIUI 12.5 కస్టమ్ స్కిన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కెమెరా ముందు భాగంలో.. Redmi 10A 13MP కెమెరాతో పాటు LED ఫ్లాష్‌ కలిగి ఉంది. సెల్ఫీల కోసం.. ముందు భాగంలో 5-MP కెమెరా ఉంది. ఫోన్ బాక్స్‌లో 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. వెనుకకు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, మైక్రో USB పోర్ట్ GPS వంటి ఫీచర్లను కలిగి ఉంది.

Post a Comment

0 Comments

Close Menu