Ad Code

త్వరలో షియోమి 12 ప్రో రిలీజ్


దేశంలో వరుసగా బడ్జెట్, ప్రీమియం ఫోన్లను లాంచ్ చేస్తూ అమ్మకాల్లో టాప్‌లో ఉన్న షియోమి కంపెనీ త్వరలో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. షియోమి 12 ప్రో పేరుతో ఒక ప్రీమియం ఫోన్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. షియోమి 12 ప్రో ఫోన్‌ను కంపెనీ మార్చి 15న చైనాలో ఆవిష్కరించింది. షియోమి 12 షియోమి 12 ఎక్స్‌తో పాటు దీన్ని గ్లోబల్  డెబ్యూ డివైజ్‌గా పరిచయం చేసింది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌లను కలిగి ఉన్న షియోమి 12 సిరీస్‌ కోసం కస్టమర్లు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, AMOLED డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్లను షియోమి రూపొందిస్తోంది. షియోమి స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో 12 ప్రో ఫోన్‌ను తయారు చేస్తోంది. షియోమి 12 ప్రో ఫోన్‌ను త్వరలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. చైనా, ఇతర గ్లోబల్ మార్కెట్‌లలో రిలీజ్ అయిన ఈ ఫోన్‌.. అవే ఫీచర్లతో భారత్‌లోనూ లాంచ్ కానుంది. Xiaomi 12 Pro డివైజ్ 6.73 అంగుళాల WQHD E5 AMOLED డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ Android 12 బేస్డ్ MIUI 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు 12GB LPDDR5 RAMతో రన్ అవుతుంది. దీన్ని 256GB వరకు విస్తరించవచ్చు. చైనా, ప్రపంచ మార్కెట్లలో ఈ ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జర్‌తో పాటు 4,600mAh బ్యాటరీతో లాంచ్ అయింది. షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాలిటీ ఇమేజెస్‌ను క్యాప్చర్ చేయగలిగే కెమెరా లెన్స్ ఉన్నాయి. దీంట్లో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 32MP ఫ్రంట్ లెన్స్‌ ఉంటాయి. 12 ప్రో 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర గ్లోబల్ మార్కెట్‌లో 999 డాలర్లుగా ఉంది. మన కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ. 76,300కు సమానం. మన దేశంలో రిలీజ్ అయ్యే షియోమి 12 ప్రో.. ఇతర గ్లోబల్ రీజియన్‌లలో ఉన్నటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో రానుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్ భారతదేశంలో అదే MIUI 13, Android 12తో పాటు Snapdragon 8 Gen 1 చిప్‌సెట్‌తో కొనసాగే అవకాశం ఉంది. షియోమి 12 ప్రో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, సింగిల్ సెల్ఫీ లెన్స్‌తో వస్తుంది. దీని డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో మంచి ఫర్ఫార్మెన్స్‌ను అందిస్తుంది. ఈ 5జీ ఫోన్ లాంచింగ్ డేట్‌ను షియోమి అధికారికంగా ప్రకటించలేదు. అయితే షియోమీ 12 ప్రో 5జీ ఫోన్ గురించి ఈ నెల 12న అధికారిక ప్రకటన చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Post a Comment

0 Comments

Close Menu