Ad Code

దేశంలో ఆపిల్ ఐఫోన్ 13 త్వరలో తయారీ !


తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపానగల ఆపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ భాగస్వామ్య కంపెనీ ఫాక్స్‌కాన్స్‌తో భారత్‌లో ఐఫోన్ 13 తయారీకి ఒప్పందం చేసుకున్నది.  ప్రపంచంలోనే స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిలో రెండోస్థానంలో ఉన్న ఆపిల్ కంపెనీ బలోపేతానికి తోడ్పడనున్నదని ఇండియాలోని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. భారత దేశంలో స్థానిక వినియోగదారుల కోసం ఐఫోన్ 13 తయారుచేసేందుకు తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. ఐఫోన్ 13 తయారీ తర్వాత మిగతా అన్ని మోడళ్లను ఫాక్స్‌కాన్‌, విస్ట్రాన్ కంపెనీల ద్వారా తయారు చేయనుంది. అలాగే, మూడో భాగస్వామి పెగట్రాన్‌కూడా ఈ నెలలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తి ప్రారంభించనుంది. ఆపిల్ కంపెనీ భారత్‌లో ఐఫోన్ల తయారీని 2017లో అంటే ఐదేళ్ల క్రితం ప్రారంభించింది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11, ఐఫోన్ 12 ఫోన్లను స్థానికంగా తయారుచేస్తున్నది. త్వరలో ఐఫోన్ 13 ఈ లిస్ట్‌లో చేరనుంది.

Post a Comment

0 Comments

Close Menu