Ad Code

ఆగస్టులో చంద్రయాన్‌-3 కి సన్నాహాలు..!


ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా  సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి వచ్చే ఆగస్టులో చంద్రయాన్‌-3 ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ఈ ప్రాజెక్టు కొంత ఆలస్యమైంది. దీనికి సంబంధించిన తొలి చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. 'ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌'లో భాగంగా ఇస్రో 'స్పేస్‌ ఆన్‌ వీల్స్‌' పేరుతో మొత్తం 75 ఉపగ్రహాలను ప్రయోగించనున్నది. దీనికి సంబంధించిన డాక్యుమెంటరీలో చంద్రయాన్‌-3 చిత్రాలను పొందుపరిచారు. చంద్రుడి ఉపరితలంపై కాలుమోపనున్న ల్యాండర్‌, ఆదిత్య-ఎల్‌1 మిషన్‌తోపాటు గగన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా దానిలో తెలిపారు. ఈ వివరాలను అనుసరించి వచ్చే ఆగస్టు నెలలో చంద్రయాన్‌-3 ని విజయవంతంగా పూర్తిచేయాలన్న సంకల్పంతో షార్‌ శాస్త్రవేత్తలు ఉన్నట్లుగా తెలుస్తున్నది.

Post a Comment

0 Comments

Close Menu