Ad Code

రియల్ మీ సీ 31 సేల్ ప్రారంభం !


కొత్తగా 10 వేల రూపాయల లోపు స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకుంటున్నట్లయితే రియల్ మీ సీ 31 స్మార్ట్ ఫోన్  తాజాగా సరికొత్త ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభించింది. ఇందులో యూనిసోక్ ప్రాసెసర్ తో పాటు 13 మెగా పిక్సల్ రియర్ కెమెరా సెటప్ కూడా అందించడం జరిగింది . 5000 ఎం ఎ హెచ్ బ్యాటరీ కూడా అమర్చడంతో చార్జింగ్ కూడా ఎక్కువసేపు వస్తుంది. ఇప్పటికే రూ.10 వేల లోపు బడ్జెట్లో రియల్ మీ నార్జో 50 ఐ, పోకో సీ 3 ఇలాంటి స్మార్ట్ ఫోన్లో కూడా అందుబాటులో ఉన్నాయి. వీటికి గట్టిపోటీ ఇవ్వడానికి రియల్ మీ సీ 31. ఈరోజు మధ్యాహ్నం  ఫ్లిప్కార్ట్ లో సేల్  ప్రారంభించింది. ఆఫ్ లైన్ స్టోర్ లో కూడా ఈ మొబైల్ లో కొనుగోలు చేయవచ్చు. లైట్ సిల్వర్ , డార్క్ గ్రీన్ కలర్ లో మనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ మొబైల్ ద్వారా రూ.8,999 . 3జీబీ ర్యామ్ అలాగే 32 జీ బీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్ అలాగే 64 జీబీ ర్యామ్ స్టోరేజ్ వేరియంట్ తో రూ.9,999కే మనకు లభిస్తోంది. ఇక ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డు అలాగే హెచ్ డి ఎఫ్ సి ఐ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే ₹1000 డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. ఇక ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu