Ad Code

ట్రిపుల్ కెమెరాలతో వన్‌ప్లస్‌ 5G ఫోన్‌ !


ఏప్రిల్ 28న జరగబోయే 'More Power To You' ఈవెంట్‌లో OnePlus Nord CE 2 Lite 5G మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. వన్‌ప్లస్‌ 5G ఫోన్‌ ట్రిపుల్ కెమెరాలతో అతి తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొస్తోంది.  OnePlus Nord CE 2 స్మార్ట్‌ఫోన్ టోన్-డౌన్ వెర్షన్‌గా రానుంది. ఈ ఫోన్ లాంచ్‌కు ముందే కంపెనీ కొన్ని వివరాలను అధికారికంగా ధృవీకరించింది. OnePlus డివైజ్ ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ మోడల్ ఫోన్ OnePlus Nord CE 2 Lite డిజైన్ ఇలానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కొత్త OnePlus ఫోన్ చిన్న మార్పులతో రానుంది. Nord CE 2 Lite, Nord 2, Nord CE 2 స్మార్ట్ ఫోన్ మోడళ్లలో రాబోయే ఫోన్ కు సంబంధించి వెనుక థర్డ్ కెమెరా ప్లేస్‌మెంట్‌ను కంపెనీ మార్చినట్టుగా కనిపిస్తోంది. అదనంగా, బ్రాండ్ 3 ఫోన్‌లను ఒకే నీలం రంగులో తీసుకొస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 3 కెమెరాలు ఉంటాయని అధికారిక టీజర్ ధృవీకరించింది. అయితే ఈ డివైజ్ ఫ్రంట్ ప్యానెల్‌ను ఎలా ఉండనుందో రివీల్ చేయలేదు. OnePlus కంపెనీ ఇప్పటికే అందిస్తోన్న పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వచ్చే అవకాశం ఉంది. అధిక-ఫ్రెష్ రేట్ స్క్రీన్‌ను కలిగి ఉండనుంది. Nord CE 2 మాదిరిగానే 90Hz డిస్‌ప్లేను కలిగి ఉండవచ్చు. OnePlus 120Hz సపోర్టును అందించే అవకాశాలు ఉన్నాయి. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో డివైజ్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుందని OnePlus ఇప్పటికే ధృవీకరించింది. ఏయే ఫీచర్లు ఉండనున్నాయో పూర్తిగా రివీల్ చేయలేదు. FULL HD+ రిజల్యూషన్‌కు సపోర్టుతో 6.58-అంగుళాల డిస్‌ప్లేతో రావచ్చని ఓ నివేదిక తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu