Ad Code

నిమిషాల్లో ఫుల్ చార్జింగ్‌ !


వన్‌ప్లస్ ఇప్పుడు 10ఆర్ 5జీ తో ముందుకొచ్చింది. ఈ 10ఆర్ 5జీ ఫోన్ 150వాట్స్ సూపర్ వూక్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఇది చార్జింగ్ పెట్టిన 17 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇందులో బేస్ వేరియంట్ 10 ఆర్ మాత్రం 80 వాట్స్ సూపర్‌వూక్ టెక్నాలజీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 33వాట్స్ సూపర్ వూక్ టెక్నాలజీతో అందుబాటులోకి రానుంది. ఇది బ్యాటరీని 0 నుంచి 50శాతం వరకు 30 నిమిషాల్లో చార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది. నిజానికి ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100ని ఉపయోగిస్తుంది, అయితే ఈ చిప్‌సెట్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 8100-MAX అని వన్‌ప్లస్ పిలుస్తోంది. దీన్నిబట్టి వన్‌ప్లస్ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం మీడియాటెక్ కస్టమ్ వేరియంట్‌ను తయారు చేసింది. రెగ్యులర్ డైమెన్సిటీ 8100 కంటే ఎక్కువ క్లాక్ స్పీడ్‌తో వస్తుందని తెలుస్తోంది. దీనర్థం ఇది గేమర్స్ ని లక్ష్యంగా చేసుకుంది. మీడియాటెక్ ప్రాసెసర్ తో వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి వస్తున్న మొదటి ఫ్లాగ్‌షిప్ ఇదే కావడం విశేషం.  ఇందులో వన్‌ప్లస్ స్లైడర్ ఉండదు కానీ కింది భాగంలో యూఎస్‌బీ టైప్-సి పోర్ట్, కుడివైపు పవర్ బటన్‌ ఉంటుంది. వన్‌ప్లస్ 10ఆర్ విషయానికొస్తే, ఇందులో కూడా ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంటుంది. ఇది 150W SuperVOOC ఛార్జింగ్ కు సపోర్ట్‌ చేస్తుంది. వన్‌ప్లస్ 10ఆర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 మ్యాక్స్ (MediaTek Dimensity 8100-MAX) ప్రాసెసర్ సాయంతో రన్ అవుతుందని ఇప్పటికే కంపెనీ ఒక ట్వీట్ ద్వారా కన్ఫామ్ చేసింది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే నార్డ్ సీఈ 2 లైట్ 5జీ 33W SuperVOOC ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని వన్‌ప్లస్ టీజ్ చేసింది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్, అధిక రిఫ్రెష్-రేట్ ప్యానెల్ కూడా ఉండవచ్చని అంచనా. ఈ ఫోన్ ధర మిగతా స్పెసిఫికేషన్లు కొద్దిరోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఈ ఫోన్ రూ.20 వేల లోపు ఉండొచ్చని సమాచారం. ఇండియాలో కంటే ముందుగా చైనాలో ఒక ఫోన్ లాంచ్ చేసేందుకు వన్‌ప్లస్ కంపెనీ సిద్ధమయ్యింది. వన్‌ప్లస్ ఏస్ (OnePlus Ace) అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 21న లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ ఏస్ ఫోన్.. వన్‌ప్లస్ 10ఆర్ ఒకటేనని టెక్ నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu