Ad Code

కలకలం రేపుతున్న మాల్‌వేర్స్ !


గూగుల్ ప్లేస్టోర్‌లో మాల్‌వేర్ ఉన్న యాప్స్ కలకలం రేపుతున్నాయి. ఇలాంటి మాల్‌వేర్లను అడ్డుకోవడం కోసం యూజర్లు యాంటీవైరస్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు యాంటీవైరస్ యాప్స్‌లో కూడా మాల్‌వేర్ ఉన్నట్టు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ యాప్స్ ద్వారా హ్యాకర్స్ యూజర్ల పాస్‌వర్డ్స్, బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. చెక్ పాయింట్‌లోని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ఆరు యాంటీవైరస్ యాప్స్‌ని గుర్తించారు. ఈ ఆరు యాంటీవైరస్ యాప్స్ షార్క్‌బాట్ ఆండ్రాయిడ్ మాల్‌వేర్ ద్వారా 15,000 పైగా యూజర్ల బ్యాంకింగ్ వివరాలు, లాగిన్ వివరాలు సేకరించినట్టు పరిశోధకులు గుర్తించారు. యూజర్లు తమ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయగానే ఈ డేటా హ్యాకర్ల సర్వర్లకు వెళ్తుంది. జియోఫెన్సింగ్ ఫీచర్, ఎవేషన్ టెక్నిక్స్ ద్వారా యూజర్ల వివరాలు సేకరిస్తోంది. ప్రపంచంలో ఆండ్రాయిడ్ మాల్‌వేర్లలో అరుదుగా కనిపించే డొమైన్ జనరేషన్ ఆల్గరిథమ్‌ను ఉపయోగిస్తున్నట్టు తేలింది. 1,000 యూనిక్ ఐపీ అడ్రస్‌లలో ఉన్న డివైజ్‌లను ఈ మాల్‌వేర్ ఇన్ఫెక్ట్ చేసినట్టు తేలింది. ఈ మాల్‌వేర్ బాధితుల్లో ఎక్కువగా ఇటలీ, యూకే నుంచి ఉన్నారని తేలింది. షార్క్‌బాట్ ఆండ్రాయిడ్ మాల్‌వేర్ యూజర్లందరినీ టార్గెట్ చేయదు. జియోఫెన్సింగ్ ఫీచర్ ద్వారా కొందరిని మాత్రమే సెలెక్ట్ చేసి టార్గెట్ చేస్తుంది. ఇండియా, చైనా, రొమేనియా, రష్యా, ఉక్రెయిన్, బెలారస్ యూజర్లు పట్టించుకోకుండా ఉండేందుకు హ్యాకర్లు జియోఫెన్సింగ్ ఫీచర్ ఉపయోగిస్తున్నారు. Atom Clean-Booster, Antivirus, Antivirus, Super Cleaner, Alpha Antivirus, Cleaner, Powerful Cleaner, Antivirus, Center Security - Antivirus (two versions) యాప్స్‌లో షార్క్‌బాట్ ఆండ్రాయిడ్ మాల్‌వేర్ ఉంది. గూగుల్ ప్లేస్టోర్‌లో 15,000 పైగా డౌన్‌లోడ్స్ ఉన్నట్టు తేలింది.  ఈ ఆరు యాంటీ వైరస్ యాప్స్‌లో షార్క్‌బాట్ మాల్‌వేర్ ఉన్నట్టు తేలడంతో ప్లేస్టోర్ నుంచి గూగుల్ ఈ యాప్స్‌ని శాశ్వతంగా తొలగించింది. సైబర్ సెక్యూరిటీ సంస్థలు నిత్యం మాల్‌వేర్ ఉన్న యాప్స్‌ని గుర్తించి యూజర్లతో పాటు గూగుల్‌ను అప్రమత్తం చేస్తుంటాయి. వాటిని గూగుల్ తొలగిస్తూ ఉంటుంది. గూగుల్ ప్లేస్టోర్‌లో కనిపించే ప్రతీ యాప్‌ని డౌన్‌లోడ్ చేయకూడదు. ప్రముఖ డెవలపర్స్ రూపొందించిన యాప్స్ మాత్రమే ఉపయోగించాలి. కొత్త యాప్ ట్రై చేసేముందు రివ్యూస్ చదవాలి. రివ్యూస్ చదివితే ఆ యాప్‌లో ఉన్న లోపాలు తెలుస్తాయి. కాబట్టి గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. 

Post a Comment

0 Comments

Close Menu