అమెరికాలో 18 ఏళ్ల యువకుడి ప్రాణాలను హెడ్‌ఫోన్స్ కాపాడింది. అతను ధరించిన హెడ్‌ఫోన్స్ బుల్లెట్‌ను అడ్డుకోవడం విశేషం. Enough_Dance_956 పేరుతో ఉన్న రెడ్డిట్ యూజర్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ పోస్ట్ చేశారు. అతను వెల్లడించిన వివరాల ప్రకారం ఆ యువకుడు రేజర్ కంపెనీకి చెందిన హెడ్‌ఫోన్స్ ధరించి ఇంట్లో స్నేహితులతో మాట్లాడుతున్నాడు. ఉదయం 10.30 గంటల సమయంలో ఓ బుల్లెట్ కిటికీ నుంచి దూసుకొచ్చింది. తలకు ఉన్న హెడ్‌ఫోన్స్‌కు తగిలింది. ఆ సమయంలో హెడ్‌ఫోన్స్ లేకపోయి ఉంటే బుల్లెట్ తలలోంచి దూసుకెళ్లేది. కానీ రేజర్ కంపెనీకి చెందిన హెడ్‌ఫోన్స్ ఆ బుల్లెట్‌ను అడ్డుకోవడం చూసి ఆ యువకుడు షాకయ్యాడు. ఒకవేళ హెడ్‌ఫోన్స్ మంచి క్వాలిటీవి కాకపోయి ఉంటే 18 ఏళ్లకే తన ప్రాణాలు పోయేవని ఆ యువకుడు చెప్పాడు. తాను మరణించి ఉంటే తన కుటుంబ సభ్యులు, స్నేహితులు పడే బాధను తాను ఊహించలేకపోతున్నానని అన్నాడు. రేజర్ కంపెనీ నుంచి ఎవరినైనా పట్టుకోండి, వారికి నేను హృదయ పూర్వకంగా ధన్యావాదాలు తెలపాలి అంటూ రెడ్డిట్‌లో పోస్ట్ చేయడం విశేషం. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోస్ అన్నింటినీ రెడ్డిట్‌లో పోస్ట్ చేశాడు సదరు యూజర్. ఈ బుల్లెట్ చూస్తే తనను చంపడానికి ప్రయత్నించారని అర్థం అవుతోందని వివరించాడు. ఈ బుల్లెట్ కిటికీ అద్దాన్ని బ్రేక్ చేస్తూ అతని హెడ్‌ఫోన్‌కు తగిలింది. ఆ బుల్లెట్ తన తలకు తగిలి ఉంటే చనిపోయేవాడినని వివరించాడు.
0 Comments