Ad Code

గూగుల్ మ్యాప్‌లోనే టోల్ ధరలు చూడొచ్చు !



గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఏదైనా లాంగ్ ట్రిప్ వెళ్లినప్పుడు రూట్ మ్యాప్ కోసం గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతుంటారు. ఇకపై వెళ్లే మార్గంలో ఎక్కడైనా టోల్ ప్లాజా ఉన్నా అక్కడి టోల్ ధరలు గూగుల్ మ్యాప్స్‌లో కనిపించనున్నాయి. గూగుల్ మ్యాప్స్ టోల్ ధరలకు సంబంధించి కొత్త ఫీచర్ రిలీజ్ చేయనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మీ ట్రిప్‌ను ప్రారంభానికి ముందే టోల్ మొత్తాన్ని లెక్కించేందుకు యూజర్లకు సులభతరం చేస్తుంది. టోల్ సంబంధిత సమాచారం స్థానిక టోలింగ్ అధికారుల సాయంతో డిస్‌ప్లే చేయనుంది. మీరు ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ప్రయాణంలో మీకు ఎంత టోల్ వసూలు చేస్తారో ముందే తెలుసుకోవచ్చు, తద్వారా టోల్ గేట్‌లు ఉండే రూట్ బెటరా లేదా ఎక్కువ టోల్స్ చెల్లించాల్సిన అవసరం లేని రూట్ బెటరా? అని నిర్ణయించుకోవచ్చు. వెళ్లాల్సిన గమ్యస్థానానికి ఎంతవరకు టోల్ చెల్లించాల్సి ఉంటుందో ఆయా ధరలను గూగుల్ మ్యాప్స్ ఆధారంగా తెలుసుకోవచ్చు. Google మ్యాప్స్‌లోకి వెళ్లి దిశల ఎగువన కుడివైపు భాగంలో మూడు డాట్స్ కనిపిస్తాయి. దానిపై నొక్కడం ద్వారా యూజర్లు తాము వెళ్లే టోల్ మార్గాలను పూర్తిగా అవైడ్ చేసుకోవచ్చు. మీకు టోల్ గేట్ లేని మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు. భారత్, అమెరికా, జపాన్, ఇండోనేషియాతో సహా పలు దేశాల్లోని దాదాపు 2వేల టోల్ రోడ్లకు ఈ నెలలో ఆండ్రాయిడ్ ఐఓఎస్‌ లలో టోల్ ధరలను రిలీజ్ చేయనున్నట్టు గూగుల్ వెల్లడించింది. అయితే ఈ దేశాలతో పాటు త్వరలో మరిన్ని దేశాలకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu