Ad Code

ప్రపంచంలోనే అతి పెద్ద రెండో గూగుల్‌ కార్యాలయం


అమెరికా తర్వాత అతిపెద్ద గూగుల్‌ క్యాంపస్ నిర్మాణానికి గచ్చిబౌలి నానక్ రామ్ గూడ వేదిక కానుంది. దాదాపు 33 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కేంద్రం ఏర్పాటు కానుంది. దీనికి ఈరోజు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భవన డిజైన్ ను ఆయన ఆవిష్కరించారు. దీని ద్వారా యువతకు ఐటీ ఉద్యోగాలు రానున్నాయి. 2015లో యూఎస్ లోని కాలిఫోర్నియాలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని కేటీఆర్ సందర్శించారు. ఈ సమయంలోనే సొంత క్యాంపస్ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య ఒప్పందం జరిగింది. ఇప్పటికే మహానగరంలో 30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గూగుల్ కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం గచ్చిబౌలిలో 7.3 ఎకరాల స్థలాన్ని గూగుల్‌ 2019లో కొనుగోలు చేసింది. దీని ద్వారా దాదాపు 30 వేల మందికి పైగా ఉద్యోగులు పని చేయడానికి వీలుగా భవనాన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించాలని గూగుల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ తో కలిసి గూగుల్ పని చేయనుంది. ఇందులో యూఎక్స్ డిజైన్, ఐటీ సపోర్టు, ఐటీ ఆటోమేషన్, అనలిటిక్స్, ప్రాజెక్టు మేనేజ్ మెంట్ ఇతర విభాగాల్లో అభ్యర్థులకు శిక్షణనివ్వబడుతుంది ఇలా శిక్షణ పొందిన అభ్యర్థులకు వివిధ సంస్థలకు అనుసంధానం చేస్తారు. ఇందులో మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలు మరింత మెరుగ్గా నిర్వహించుకొనేందుకు మద్దతు సైతం అందిస్తారు. గూగుల్ శాశ్వత క్యాంపస్ నిర్మాణంతో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మరింత అందుతాయని అంచనాలు నెలకొన్నాయి. గూగుల్ కెరీర్ సర్టిఫికేట్ ద్వారా ఐటీ సపోర్టు అందించనుంది రెండో అతిపెద్ద క్యాంపస్ రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి తేనుందని అంచన.

Post a Comment

0 Comments

Close Menu