Ad Code

కిడ్స్ ప్లస్‌ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ లో కొత్త మొబైల్ గేమ్స్ !


అమెజాన్ సంస్థ తాజాగా  పిల్లల కోసం తన సబ్‌స్క్రిప్షన్-బేస్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'అమెజాన్ కిడ్స్+' లో రెండు మొబైల్ గేమ్‌లను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో మొదటి గేమ్ సూపర్ స్పై ర్యాన్. ఇది చిల్డ్రన్స్ టీవీ షో ర్యాన్స్ వరల్డ్ (Ryan's World) ఆధారంగా రూపొందించిన ఒక మల్టీప్లేయర్ గేమ్. మరొక మొబైల్ గేమ్ డు, రీ & మి . ఇది ప్రీ-స్కూల్ పిల్లల కోసం రూపొందించిన మ్యూజికల్ ఎడ్యుకేషన్ గేమ్. సూపర్ స్పై ర్యాన్ గేమ్ ను కాజీ ఫ్యామిలీ, ర్యాన్స్ వరల్డ్, p.w గేమ్స్, అంబర్ స్టూడియోలోని టీమ్‌ల సహకారంతో డెవలప్ చేశారు. సూపర్ స్పై ర్యాన్ గేమ్ Amazon Kids + Original స్పెషల్ నుంచి పిల్లలు ఇష్టపడే ప్రతి విషయాన్ని తీసుకుంటుంది. 6 నుంచి 9 ఏళ్ల పిల్లల కోసం మల్టీ-ప్లేయర్ ఫార్మాట్‌ను ఇది క్రియేట్ చేస్తుంది. అత్యంత ప్రజాదరణ పొందిన అమెజాన్ కిడ్స్+ కంటెంట్‌లో సూపర్ స్పై ర్యాన్, డూ, రీ & మి గేమ్స్ ఉంటాయని, ఇవి పిల్లలు, పెద్దలకు ఇద్దరికీ కొత్త రకమైన వినోదాన్ని అందించాలని ఆశిస్తున్నట్లు అమెజాన్ కిడ్స్+ కంటెంట్ గ్లోబల్ హెడ్ నటాషా లిపోవాక్ తెలిపారు. పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సూపర్ స్పై ర్యాన్ డీప్ మల్టీప్లేయర్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో ఫ్రెండ్స్ లిస్టు లేదా చాట్ ఫీచర్లు ఉండవు. ఆటగాళ్లందరికీ ఎనానిమస్ స్పై-థీమ్డ్ యూజర్ నేమ్స్ ఉంటాయి. తల్లిదండ్రులు, సంరక్షకులు గేమ్‌ను సింగిల్ ప్లేయర్ మోడ్ లో ఉంచవచ్చు. అలా ప్లేయర్లు కంప్యూటర్-కంట్రోల్డ్ ప్లేయర్లతో మాత్రమే పోటీపడేలా సెట్ చేసుకోవచ్చు. పిల్లల కోసం సురక్షితమైన "పార్టీ మోడ్" కూడా ఉంది, ఇక్కడ ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లోని ప్లేయర్లు సూపర్ సీక్రెట్ స్పెషల్ కోడ్‌ను షేర్ చేస్తే కలిసి ఆడవచ్చు. డూ, రీ & మి మొబైల్ గేమ్ ఎబౌట్ ఫన్, ప్రైమ్ వీడియోలో అమెజాన్ కిడ్స్+ ఒరిజినల్ సిరీస్ డూ, రీ & మి బృందంతో కలిసి అభివృద్ధి చేశారు. ఇది 3-5 సంవత్సరాల వయస్సు గల ప్రీస్కూలర్‌ల కోసం రూపొందించిన మ్యూజిక్ ఎడ్యుకేషన్ గేమ్‌. న్యూ జనరేషన్ మ్యూజీషియన్లు, పాటల రచయితలను ప్రేరేపించాలనే ఆశతో ఇందులో "మ్యూజిక్ మాస్ట్రో" పాఠాలలో బాగా ఉపయోగపడే సంగీత విద్యా పాఠ్యాంశాల  యాక్టివిటీస్ అందించారు. ఈ గేమ్‌లో పిల్లలకు పియానో లేదా బోంగోస్‌లో పాటలు ఎలా ప్లే చేయాలో నేర్పే వివిధ రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. షీట్ మ్యూజిక్‌ని చదవడం, సోలోలు డ్యూయెట్‌ల వంటి ఫన్ మ్యూజిక్ కాన్సెప్ట్ గురించి నేర్చుకోవడం వంటి యాక్టివిటీస్ ఇందులో ఉన్నాయి. పిల్లలు తమ స్వంత గాత్రాన్ని కూడా యాడ్ చేసే ఫెసిలిటీ ఇందులో ఉంది. ఈ ఫెసిలిటీతో గేమ్‌లో వాయిద్యాలను ప్లే చేస్తూ రికార్డింగ్‌లతో విభిన్న ఇన్‌స్ట్రుమెంటల్ లూప్‌లను కలపొచ్చు. అలా స్టూడియోలో పిల్లలు వారి స్వంత సంగీతాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సూపర్ స్పై ర్యాన్ యూఎస్, యూకే, ఐర్లాండ్‌లోని యాపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లేలో అందుబాటులో ఉంది. ఇది త్వరలో కెనడా, జర్మనీ, జపాన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu