Ad Code

స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అవుతోందా?


స్మార్ట్‌ఫోన్ యూజర్లు ప్రధానంగా ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి బ్యాటరీ బ్యాకప్. బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం యూజర్లకు తలనొప్పిగా మారుతుంటుంది. ఎక్కువగా జర్నీ చేసేవారు, మార్కెటింగ్ ఉద్యోగాలు చేసేవారిని ఈ సమస్య ఇంకా ఎక్కువగా వేధిస్తుంది. ఎక్కడ వీలైతే అక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.  కొన్ని స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీ అయితే కనీసం పూర్తిగా ఒక రోజు కూడా బ్యాకప్  అందించలేవు. కొన్ని గంటల్లోనే బ్యాటరీ ఖాళీ అవుతూ ఉంటుంది. అయితే స్మార్ట్‌ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్ మార్చడంతో పాటు కొన్ని టిప్స్ పాటించడం ద్వారా బ్యాటరీ వినియోగాన్ని తగ్గించొచ్చు. కాబట్టి ఇంకొన్ని గంటలు ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ వాల్‌పేపర్స్ ఉపయోగిస్తున్నారా? అయితే వెంటనే ఈ వాల్‌పేపర్స్ తొలగించండి. చూడ్డానికి లైవ్ వాల్‌పేపర్స్ బాగానే ఉన్నా బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది. అందుకే వీటిని తొలగించి స్టాటిక్ వాల్‌పేపర్ అంటే ఎలాంటి యానిమేషన్ లేని వాల్‌పేపర్స్ ఉపయోగించండి. డార్క్ వాల్‌పేపర్స్ అయితే ఇంకా మంచిది.  స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువగా పెట్టుకోవడం చాలామందికి అలవాటు. దీనివల్ల ఎక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది. ఆటో బ్రైట్‌నెస్ పెట్టుకుంటే చాలు. బయట ఉన్న వెలుతురును బట్టి మీ స్మార్ట్‌ఫోన్‌లో బ్రైట్‌నెస్ అడ్జెస్ట్ అవుతూ ఉంటుంది. దీని వల్ల బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాన్యువల్‌గా బ్రైట్‌నెస్ మార్చుకోవాలి. మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ ఫీచర్స్ ఉపయోగిస్తుంటారా? మంచిదే. కానీ... అవసరం ఉన్నప్పుడే వాటిని ఆన్ చేయాలి. వాడనప్పుడు ఆఫ్ చేయాలి. లేకపోతే అవి యాక్టీవ్‌గానే ఉంటాయి. ఉదాహరణకు మీరు వైఫై ఎప్పుడూ ఆన్‌లో పెట్టి ఉంచారంటే వైఫై ఫీచర్ నిరంతరం వైఫై నెట్వర్క్‌ల కోసం వెతుకుతూనే ఉంటుంది. ప్రతీ యాప్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కూడా బ్యాటరీని ఖాళీ చేస్తుంటాయి. నోటిఫికేషన్ రాగానే స్క్రీన్ ఆన్ కావడం, నోటిఫికేషన్ పాప్ అప్ రావడం లాంటివాటికి కూడా బ్యాటరీ ఖర్చవుతుంది. అవసరంలేని యాప్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు వచ్చే వైబ్రేషన్ కూడా ఆఫ్ చేయండి. స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించకపోయినా కొన్ని యాప్స్ అలాగే ఉంటాయి. వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయడం కుదరదు. అవి బ్యాటరీ ఖాళీ చేస్తుంటాయి. అందుకే ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో అవసరం లేని యాప్స్ గుర్తించి డిసేబుల్ చేయండి. అన్‌ఇన్‌స్టాల్ చేసే అవకాశం ఉంటే వాటిని డిలిట్ చేయండి. ఇవన్నీ మేనేజ్ చేయడం మీకు కుదరకపోవచ్చా? పైన చెప్పిన సెట్టింగ్స్ మార్చడం సాధ్యం కాదా? అయితే మీరు ఓ మంచి పవర్ బ్యాంక్ ఎప్పుడూ మెయింటైన్ చేయాల్సిందే. జర్నీలో ఉన్నప్పుడు లేదా మీకు ఛార్జర్ అందుబాటులో లేనప్పుడు ఛార్జింగ్ చేయడానికి పవర్ బ్యాంక్ ఉపయోగపడుతుంది. రూ.2,000 లోపు మంచి పవర్ బ్యాంక్స్ అందుబాటులో ఉన్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu