Ad Code

నథింగ్ టెక్నాలజీస్‌లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?


కార్ల్ పీ  స్థాపించిన కన్జ్యూమర్ టెక్నాలజీ కంపెనీ నథింగ్ టెక్నాలజీస్. ఇప్పటికే ఇయర్‌బడ్స్ రిలీజ్ చేసిన ఈ కంపెనీ నథింగ్ స్మార్ట్‌ఫోన్‌లు, నథింగ్ ఓఎస్ ఇంట్రడ్యూస్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే నథింగ్ కంపెనీ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ (2) గా పిలిచే ఓ కొత్త కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌ను అనౌన్స్ చేసింది. ఈ కంపెనీ ఇంతకుముందు ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఫ్యాన్స్ నుంచి 1.5 మిలియన్లను సేకరించింది. ఫస్ట్ కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్ తరువాత నుంచి నథింగ్ కంపెనీలో చాలా మార్పులు కనిపించాయి. నథింగ్ఇయర్ (1) ట్రూ వైర్‌లెస్  ఇయర్‌బడ్స్ లాంచ్ చేయడం నుంచి ఈ కంపెనీలో చాలా మార్పులు వచ్చాయి. ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌పై కూడా పని చేస్తోంది. 2022 వేసవిలో నథింగ్ ఫోన్ (1)ని లాంచ్ అవుతుందని కార్ల్ పీ కన్ఫర్మ్ చేశారు. కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ (2) నుంచి నథింగ్ ఎంత మనీ సేకరించనుంది? కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ (2) రౌండ్‌లో భాగంగా 10 మిలియన్ డాలర్లు సేకరించాలని నథింగ్ యోచిస్తోంది. చివరి రౌండ్‌లో కేవలం 54 సెకన్లలో 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేయగలిగామని కంపెనీ పేర్కొంది. కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ రౌండ్‌కు ఇప్పటికే 7 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని.. వెబ్‌సైట్‌లో 70 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ప్రీ-రిజిస్టర్ అయిందని కంపెనీ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu