Ad Code

చైనాలో రెడ్‌మి నోట్ 11 SE స్మార్ట్ ఫోన్ విడుదల !


చైనాలో Redmi Note 11T సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. Redmi Note 11 SE 6.5-అంగుళాల IPS LCDని కలిగి ఉంది. 1080 x 2400 పిక్సెల్ FULL HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్టు అందిస్తుంది. ఆన్-స్క్రీన్ కంటెంట్ ఆధారంగా స్క్రీన్ 30Hz, 90Hz వరకు డైనమిక్‌గా రిఫ్రెష్ అందిస్తుంది. LCDని డివైజ్ కావడంతో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ లేదు. సైడ్-మౌంటెడ్ స్కానర్‌ను అమర్చారు. ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్‌ నిలువుగా ఉంది. 48MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. అల్ట్రావైడ్ కెమెరా లేదు. డెప్త్ మ్యాపింగ్ కోసం ఫోన్‌లో 2MP సెకండరీ సెన్సార్ అందించారు. ఇక సెల్ఫీల కోసం.. ఈ ఫోన్‌లో 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. హుడ్ కింద.. ఫోన్ MediaTek డైమెన్సిటీ 700 SoC నుంచి ప్రాసెసర్ ఉంది. గరిష్టంగా 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీతో వచ్చింది. స్టోరేజ్ అవసరమైతే పెంచుకునేందుకు ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. Redmi Note 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీని అందిస్తుంది. Android 11 రన్ అవుతుంది. MIUI 12.5 లేయర్ కలిగి కలిగిన ఈ డివైజ్ Android 12 అప్‌డేట్ వస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. Note 11 SE బేస్ మోడల్ 4GB + 128GB వేరియంట్ ధర CNY 1,099 (దాదాపు రూ. 12,800) నుంచి ప్రారంభమవుతుంది. 8GB+128GB వేరియంట్ కూడా ఉంది. దీని ధర CNY 1,399 (దాదాపు రూ. 16,200)గా ఉంది. ఈ ఫోన్ షాడో బ్లాక్, డీప్ స్పేస్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. Redmi Note 11 SE భారత మార్కెట్లో ఎప్పుడైనా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. 


Post a Comment

0 Comments

Close Menu