Ad Code

అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2 (2022) స్మార్ట్‌వాచ్‌ విడుదల


ఒకప్పుడు చేతి గడియారాలు  కేవలం సమయాన్ని మాత్రమే తెలిపేవి. కానీ ఈ రోజుల్లో వస్తున్న వాచీలు డాక్టర్‌ల వలె ఆరోగ్యాన్ని కూడా తెలియజేస్తున్నాయి. స్మార్ట్‌గా మారిన ఈ వాచ్‌లు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌వాచ్‌లను టెక్ కంపెనీలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ వేరబుల్ బ్రాండ్ అమేజ్‌ఫిట్ అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2 కి కొత్త వెర్షన్ వాచ్‌ను లాంచ్ చేసింది. గతంలో విడుదలైన అమేజ్‌ఫిట్ జీటీఆర్‌ 2కు కొత్త వెర్షన్‌గా తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌వాచ్ అనేక హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లతో వస్తుంది. అయితే ఒరిజినల్ వెర్షన్‌తో పోల్చితే... అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2 (2022)లో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్లు ఎక్కువగా లేవని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌వాచ్ కొత్తగా హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ సింగిల్ ఛార్జ్‌పై 6 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2 స్మార్ట్‌వాచ్ ఓపెన్ సేల్ మే 23న ప్రారంభమవుతుంది. ఈ వాచ్ బ్లాక్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్, అమేజ్‌ఫిట్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పరిమిత-కాల ఆఫర్ కింద ఈ స్మార్ట్‌వాచ్‌ను రూ.10,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ మే 23 వరకే ఉంటుంది. అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2 అసలు ధర రూ.11,999గా నిర్ణయించారు. మే 23 తర్వాత రూ.11,999 చెల్లించవలసి ఉంటుంది. అమేజ్‌ఫిట్ జీటీఆర్ 2 (2022) స్టెయిన్‌లెస్ స్టీల్, బ్లాక్ అల్యూమినియం అల్లాయ్ కేస్‌తో వస్తుంది. ఈ వాచ్‌లో 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో 1.39-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, ఫుల్లీ రొటేటబుల్ స్క్రీన్‌, 50 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, 24-అవర్ హార్ట్ రేట్ మానిటరింగ్, బ్లడ్-ఆక్సిజన్ శాచ్యురేషన్ మెజర్‌మెంట్, పీఏఐ హెల్త్ అసెస్‌మెంట్, స్లీప్ క్వాలిటీ మానిటరింగ్, స్ట్రెస్ లెవెల్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్ వినూత్నమైన పీఏఐ హెల్త్ అసెస్‌మెంట్ సిస్టమ్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. పీఏఐ సిస్టమ్‌ హృదయ స్పందన డేటా, ట్రాక్ చేసిన యాక్టివిటీలు, ఇతర ఆరోగ్య డేటాను చాలా సింపుల్‌గా అర్థమయ్యే పీఏఐ స్కోర్‌గా మార్చగలదు. ఫలితంగా శారీరక ఆరోగ్యాన్ని ఒక్క చూపులో తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్‌ 90కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 5ATM రేటింగ్‌ గల వాటర్‌ప్రూఫ్ ఫీచర్‌తో లాంచ్ అవుతుంది. ఈ ఫిట్‌నెస్ వాచ్‌లో దాదాపు 3జీబీ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది, కాబట్టి యూజర్లు మ్యూజిక్ ట్రాక్‌లను స్టోర్ చేసుకోవచ్చు. అలా ఫోన్‌ని తీసుకెళ్లకుండా వాచ్‌ని ఉపయోగించి మ్యూజిక్ వింటూ వర్కౌట్స్‌ చేయవచ్చు. కాల్స్‌ లేదా నోటిఫికేషన్లను వచ్చినప్పుడు హాప్టిక్ వైబ్రేషన్‌తో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌ను ఈ వాచ్ యూజర్లకు అందిస్తుంది. మీ ప్రైవసీని వాచ్‌ను లాక్ చేసే వేర్ డిటెక్షన్ ఫంక్షన్ కూడా ఉంది. మీరు అదనపు భద్రత కోసం పాస్‌వర్డ్‌ని జోడించవచ్చు. కొత్త Amazfit GTR 2 (2022)లో ఇన్‌బిల్ట్ మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉన్నాయి కాబట్టి యూజర్లు బ్లూటూత్ కాల్స్‌ చేసుకోవచ్చు. కంపెనీ అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu