Ad Code

రియల్ మీ ప్యాడ్ మినీ లాంచింగ్ ఆఫర్ కింద రూ.2వేలు తగ్గింపు


రియల్ మీ రీసెంట్ గా రియల్ మీ ప్యాడ్ మినీ పేరిట కొత్త బడ్జెట్ ట్యాబ్లెట్ తీసుకొచ్చింది. రియల్ మీ ప్యాడ్ మినీ (ఆండ్రాయిడ్) విక్రయాలు ఈరోజు మధ్యాహ్నం మొదలయ్యాయి. రియల్ మీ ప్యాడ్ కంటే ప్యాడ్ మినీ కొంచెం చిన్నదిగా పట్టుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది. సైజులోనే కాదు, పనితీరులోనూ రియల్ మీ ప్యాడ్ తో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచ్చినట్టు రియల్ మీ సంస్థ ప్రకటించింది. పిల్లల ఆన్ లైన్ పాఠాల కోసం, వీడియోలను చూడ్డానికి ఈ రియల్ మీ ప్యాడ్ మినీ ఆకర్షణీయంగా ఉంటుంది. వైఫై, ఎల్టీఈని సపోర్ట్ చేసే రకాలు ఇందులో ఉన్నాయి. వైఫై పై పని చేసే 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ధర రూ.10,999, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999., అదే ఎల్టీఈ (4జీని నెట్ వర్క్ సిమ్ తో పని చేసే) వేరియంట్ 3జీబీ, 32జీబీ ధర రూ.12,999, 4జీబీ, 64జీబీ వేరియంట్ ధర రూ.14,999, బ్లూ, గ్రే రంగుల్లో లభిస్తున్నాయి.  ఫ్లిప్ కార్ట్, రియల్ మీ ఆన్ లైన్ స్టోర్లలో  విక్రయాలు మొదలయ్యాయి. ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఇవి లభించనున్నాయి. లాంచింగ్ ఆఫర్ కింద రూ.2వేలు తగ్గింపును రియల్ మీ ఆఫర్ చేసింది.

Post a Comment

0 Comments

Close Menu