Ad Code

ప్లాస్టిక్ బకెట్‌ ఆఫర్ ధర రూ.25,999 ?


అమెజాన్‌లో ఓ ప్లాస్టిక్ బకెట్ ధర రూ.35,990. డిస్కౌంట్ సుమారు రూ.10,000 తీసేస్తే ఆఫర్ ధర రూ.25,999. బకెట్ ధర రూ.25,999 ఏంటని నెటిజన్లు అవాక్కవుతున్నారు. ట్విట్టర్‌లో  పోస్టులు చేస్తున్నారు. ఈ పోస్టులు వైరల్‌గా మారాయి. అమెజాన్‌లో రూ.25,999 ధరకు లిస్ట్ అయిన బకెట్‌ను చూసి ఓ వ్యక్తి ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆ బకెట్ స్క్రీన్ షాట్ కూడా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. రూ.25,999 ధరకు లిస్ట్ అయిన బకెట్ ఈఎంఐలో కూడా అందుబాటులో ఉన్నట్టు కనిపించడం నెటిజన్స్‌కి షాకిచ్చింది. ప్రస్తుతం ఈ బకెట్ అమెజాన్‌లో అందుబాటులో లేదు. Currently unavailable అని స్టేటస్ చూపిస్తోంది. కొందరైతే తాము ఈ బకెట్ ఆర్డర్ చేశామని ట్వీట్ చేశారు. తమ ఆర్డర్‌కు సంబంధించిన వివరాలను స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేశారు. అమెజాన్‌లో రూ.25,999 ధరకు బకెట్ లిస్ట్ కావడంపై ట్విట్టర్‌లో జోకులు కనిపిస్తున్నాయి. అది ఎన్ఎఫ్‌టీ కావొచ్చని, అందుకే అంత ధర ఉందని ఒకరు రిప్లై ఇచ్చారు. మరో బకెట్ రూ.21,057 ధరకు లిస్ట్ అయిందని ఇంకొకరు పోస్ట్ చేశారు. ఈ బకెట్ కొనాలంటే కిడ్నీ అమ్మాలని మరొకరు కామెంట్ చేశారు. ఈ బకెట్ ప్రొడక్ట్ లిస్టింగ్‌లో రివ్యూ కూడా ఉంది. ధర చాలా తక్కువని, మంచి క్వాలిటీ అని, అంత సులువుగా ఈ బకెట్ విరిగిపోదని, కనీసం ఈ బకెట్ ధర రూ.99,999 ఉండాలని ఒకరు రివ్యూ రాయడం విశేషం. అయితే లిస్టింగ్‌లో పొరపాటు వల్ల ఇలా జరిగి ఉండొచ్చని నెటిజన్లు కొందరు భావిస్తున్నారు. రూ.259.99 ధరకు లిస్ట్ చేయబోయి రూ.25,999 ధరకు లిస్ట్ చేసి ఉండొచ్చని కామెంట్ చేస్తున్నారు. సాధారణంగా ప్రొడక్ట్ లిస్టింగ్‌లో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి. తక్కువ ధర ఉండే ప్రొడక్ట్ ఎక్కువ ధరకు లిస్ట్ కావడం, ఎక్కువ ధర ఉన్న వస్తువు తక్కువ ధరకు లిస్ట్ కావడం మామూలే. అయితే ఎక్కువ ధర ఉన్న ప్రొడక్ట్ తక్కువ ధరకు లిస్ట్ అయినప్పుడు కస్టమర్లు ఆర్డర్ చేసి లాభం పొందుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ప్రొడక్ట్ డెలివరీ కావొచ్చు లేదా క్యాన్సిల్ కావొచ్చు.

Post a Comment

0 Comments

Close Menu