Ad Code

మెటా 3డి అవతార్‌ని ఫేస్‌బుక్‌లో సృష్టించడం ఎలా?


మెటా సంస్థ ఇప్పుడు తన ఫేస్‌బుక్‌ మరియు మెసెంజర్ యాప్‌లను వినియోగిస్తున్న భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా అప్‌డేట్‌ చేయబడిన 3D అవతార్‌లను ప్రకటించింది. ఆన్‌లైన్ ప్రపంచంలో మెరుగ్గా వ్యక్తీకరించడానికి మీ యొక్క వర్చువల్ వెర్షన్‌ను సృష్టించడానికి మెటా 3D అవతార్‌లు మిమ్మల్ని అనుమతిస్తాయి. ఈ కొత్త అప్‌డేట్‌లు వినికిడి సహాయాలు మరియు కోక్లియర్ ఇంప్లాంట్‌లకు మద్దతునివ్వడమే కాకుండా అవతార్‌ల కోసం వీల్‌చైర్‌ను కూడా జోడిస్తుంది. ఈ జోడింపులతో మెటా సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృత ప్రేక్షకుల సంఖ్యని మరింత పెంచుకోవాలని యోచిస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ఇన్స్టాగ్రామ్ మరియు మెసెంజర్ యాప్‌లలో కూడా Meta 3D అవతార్‌లను ఉపయోగించవచ్చు. ముందుగా ఫోన్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేయండి. హాంబర్గర్ ఐకాన్ వలె కనిపించే మెనుపై క్లిక్ చేయండి. తరువాత 'See more' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. అవతార్‌ ఎంపికపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ అవతార్‌ని మీ ఇష్టానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. మార్పులు చేయడం పూర్తయిన తరువాత 'ఫినిష్' బటన్‌పై నొక్కండి. ఇప్పుడు మీరు మెటా 3D అవతార్‌లను ఉపయోగించి ఏదైనా పోస్ట్‌ని సృష్టించవచ్చు మరియు Facebook యాప్‌లో స్టేటస్ ని అప్‌డేట్ చేయవచ్చు. మీరు 3D అవతార్‌ని మీ ప్రొఫైల్ చిత్రంగా కూడా ఉపయోగించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu