Ad Code

మోటొరోలా నుంచి మోటో ఈ32 స్మార్ట్‌ఫోన్ విడుదల


మోటొరోలా నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది. యూరప్‌లోని ఎంపిక చేసిన మార్కెట్లలో మోటో ఈ32 పేరుతో కొత్త ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది 90Hz డిస్‌ప్లే, Unisoc T606 చిప్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 18W ఫాస్ట్ ఛార్జింగ్, వాటర్ రిపెల్లెంట్ డిజైన్‌ వంటి ఫీచర్లతో రిలీజ్ అయిన బడ్జెట్ ఫోన్. యూరప్‌లో మోటొరోలా E32 ధర EUR 149గా ఉంది. మన కరెన్సీలో దీని ధర దాదాపు రూ. 12,000కు సమానం. 4GB RAM, 64GB స్టోరేజ్ వేరియంట్‌కు ఈ ధర వర్తిస్తుంది. మోటో E32 ఫోన్ ఇతర మార్కెట్లలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయంపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. మోటో E32 ఫోన్ 6.5-అంగుళాల 90Hz IPS LCD డిస్‌ప్లేతో, 720p రిజల్యూషన్, స్క్రీన్ మధ్యలో హోల్ పంచ్ కట్-అవుట్‌తో వస్తుంది. ఇది 4GB RAM, 64GB స్టోరేజ్‌తో జత చేసిన Unisoc T606 చిప్‌ను కలిగి ఉంది. డివైజ్ స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. ఈ మోటో ఫోన్ సాఫ్ట్‌వేర్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంటుంది. 16MP మెయిన్, 2MP పోర్ట్రెయిట్, మరో 2MP మాక్రో షూటర్‌ ఈ సెటప్‌లో ఉన్నాయి. దీంతోపాటు 8MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. మోటొరోలా మోటో E32 ఫోన్.. వాటర్-రిపెల్లెంట్ డిజైన్‌తో యూజర్లను ఆకర్షిస్తుంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ దీని మరో స్పెషాలిటీ. ఈ ఫోన్ మిస్టీ సిల్వర్, స్లేట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్స్‌ లో అందుబాటులో ఉంటుంది. మోటొరోలా కంపెనీ వరుసగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తోంది. ఇటీవల కంపెనీ ఇండియాలో మోటో జీ 22  పేరుతో బడ్జెట్, ఎంట్రీ లెవల్ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.10,999గా నిర్దేశించింది. ఈ బడ్జెట్ ఫోన్ వేగవంతమైన 90 Hz డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో G 37 చిప్, 50 MP క్వాడ్ కెమెరా సెటప్, 20 W ఫాస్ట్ ఛార్జింగ్, Android 12 సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. దీని ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లపై ఎలాంటి సమాచారం లేనప్పటికీ, ఈ ఫోన్‌కు 3 సంవత్సరాల హామీతో సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయని మోటొరోలా తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu