రెడ్‌మి కే50 సిరీస్‌లో అల్ట్రా పేరుతో మరో స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. రెడ్‌మి కే50, రెడ్‌మి కే50 ప్రొ వెర్షన్‌ను ఈ ఏడాది మార్చిలో కంపెనీ లాంఛ్ చేయగా రెడ్‌మికే50 అల్ట్రా లాంఛ్‌కు కసరత్తు సాగుతోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో రెడ్‌మి కే50 అల్ట్రా ఎంట్రీ ఉంటుందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. జులై నుంచి డిసెంబర్ మధ్యలో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ ప్రకటించే అవకాశం ఉంది. కే50 అల్ట్రా మోడల్‌పై కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినా ఈ మోడల్‌పై కసరత్తు వేగంగా సాగుతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. రెడ్‌మి కే50 అల్ట్రా స్నాప్‌డ్నాగన్ 8+ జెన్ 1ఎస్ఓసీ చిప్‌సెట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకు రానుంది. రెడ్‌మి కే50 సిరీస్‌లో ఇది తొలి క్వాల్‌కాం పవర్డ్ ఫోన్ కావడం గమనార్హం. ఈ స్మార్ట్‌ఫోన్ 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో రెడ్‌మి కే50 అల్ట్రా ?
0
May 31, 2022
Tags