Ad Code

ప్రైవేట్ ఫోన్ కాల్ టాక్స్ ఆధారంగానే 53% మందికి యాడ్స్ !


స్మార్ట్ ఫోన్లు మీ ప్రైవేట్ ఫోన్ కాల్స్  వింటున్నాయని ఒక సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది. వినడమే కాదు వెబ్ సైట్లలో, యాప్‌లలో మీ మాటలు, కన్వర్జేషన్స్‌కు తగ్గ యాడ్స్‌ను ఇస్తున్నాయి. మీరు ఫోన్ లో ఏం మాట్లాడితే దానికి సంబంధించిన యాడ్స్ ఇస్తున్నాయి. ఈ వివరాలను లోకల్ సర్కిల్స్ సర్వే ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. సెర్చ్ చేస్తున్న వెబ్‌సైట్లలో, యాప్స్‌లో ప్రైవేట్ కాల్స్‌కు రిలేటడ్ యాడ్స్ కనిపిస్తున్నాయని 53 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పినట్లు లోకల్ సర్కిల్స్ వివరించింది. 28 శాతం మంది తరుచుగా యాడ్స్ చూశామని చెప్పారు. 19 శాతం మంది చాలా సార్లు ఇలాగే యాడ్స్ వచ్చాయని పేర్కొన్నారు. 6శాతం మంది కొన్ని సార్లు మాత్రమే ఇలా జరిగిందని తెలిపారు. 24 శాతం మంది ఇలాంటి యాడ్స్ చూడలేదని తెలిపారు. 23 శాతం మంది ఏం చెప్పలేకపోయారని లోకల్ సర్కిల్స్ సర్వే నివేదిక వెల్లడించింది. 38 వేల మంది నుంచి అభిప్రాయాలను సేకరించి, లోకల్ సర్కిల్స్ ఈ సర్వే చేసింది. తన ఫోన్ సంభాషణలకు అనుగుణంగా యాడ్స్ రావడం చూస్తున్నామనే కామెంట్స్ ప్రజల నుంచి పెరిగాయని లోకల్ సర్కిల్ పేర్కొంది. అందుకే ఈ సర్వే చేశామని వివరించింది. స్మార్ట్ ఫోన్లలోని కనీసం 84 శాతం యాప్స్ మన కాంటాక్ట్ లిస్టును, మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసుకోవడానికి పర్మిషన్స్ అడుగుతుంటాయి. కొన్ని యాప్స్ అయితే ఈ పర్మిషన్స్ లేకపోతే పనిచేయడం లేదు. వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్, ట్రూకాలర్ వంటి యాప్స్ మైక్రో ఫోన్ ను యాక్సెస్ చేస్తున్నాయి. ముఖ్యంగా జూమ్, స్కైప్, గూగుల్ మీట్ వంటి ఆడియో లేదా వీడియో కాలింగ్ యాప్స్, ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా యాప్స్ యూజర్ల మైక్రోఫోన్‌ను యాక్సెస్ చేసుకోవడానికి ఎక్కువగా పర్మిషన్ అడుగుతున్నాయి. లోకల్ సర్కిల్ సర్వే ప్రకారం 53 శాతం మంది తమ ఫోన్ సంబాషణలకు రిలేటెడ్ గా ఉన్న యాడ్స్ వెబ్ సైట్లలో కనిపిస్తున్నాయని చెప్పారు. చాలా మంది యూజర్లకు యాప్స్ ఎందుకు మైక్రోఫోన్ పర్మిషన్ అడుగుతాయో తెలియదని, సేకరించిన డేటాకు ఎవరితో పంచుకుంటున్నాయో తెలియదని లోకల్ సర్కిల్ పేర్కొంది. 9 శాతం మంది రెస్పాండెంట్లు ఫోన్ లోని అన్ని యాప్ లకు మైక్రో ఫోన్ పర్మిషన్ ను ఇచ్చామని తెలిపారు. కేవలం ఆడియో. వీడియో యాప్స్ కు మాత్రమే పర్మిషన్ ఇచ్చామని 18 శాతం మంది పేర్కొన్నారు. మ్యూజిక్, ఆడియో వీడియో రికార్డింగ్ యాప్స్ కు మైక్రోఫోన్ పర్మిషన్ ఇచ్చామని 11శాతం మంది రెస్పాండెంట్లు తెలిపారు. వాయిస్ ద్వారా ఫోన్ ను వాడడంలో సాయపడే యాప్స్ కు మైక్రోఫోన్ పర్మిషన్ ఇచ్చామని 4 శాతం మంది రెస్పాండెంట్లు తెలిపారు. తమ కాంటాక్ట్ లిస్టును యాక్సెస్ చేసుకోవడానికి వాట్సాప్ కు పర్మిషన్ ఇచ్చామని 84 శాతం మంది సర్వే లో వెల్లడించారు. ఫేస్ బుక్ , ఇన్ స్టాగ్రామ్ కు 51 శాతం మంది , ట్రూకాలర్ కు 41 శాతం మంది పర్మిషన్ ఇచ్చామని తెలిపారు. తరుచూ ఇలా యాడ్స్ రావడం స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆందోళనకు కలిగిస్తుందని లోకల్ సర్కిల్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. మైక్రో ఫోన్ యాక్సెస్ అవసరమయ్యే యాప్ లు తప్పనిసరిగా డేటా ఎలా ఉపయోగిస్తున్నారో స్పష్టంగా తెలపాలని ఆయన అన్నారు. దేశంలోని ప్రజల డేటా ప్రైవసీకి భంగం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం పర్సనల్ డేటా ప్రొటక్షన్ బిల్లు -2019 ని తీసుకురావాలని చూస్తోంది. ఈ బిల్లుకు పార్లమెంటులో ఇంకా ఆమోదం రాలేదు. డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఏర్పాటే లక్ష్యంగా అప్పటి ఐటీ శాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్, 2019 డిసెంబర్ లో లోక్ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లు డేటా ప్రాసెసింగ్ ను నియంత్రిస్తుంది. అయితే సర్వే ఫలితాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA), భారతీయ రిజర్వ్ బ్యాంక్ కు అందించారు. డేటా నియంత్రణ ప్రక్రియ త్వరగా చేయకపోతే ఆర్థిక మోసాలు పెరిగిపోతాయని తపారియా అభిప్రాయపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu