Ad Code

ఎన్‌హాన్సెడ్ ట్యాగ్స్ అంటే ఏంటి ?


సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్‎స్టా్గ్రామ్ యూజర్ల ఉపయోగం కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూనే ఉంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్ ను 'ఎన్‌హాన్సెడ్ ట్యాగ్స్' పేరుతో యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ నిజానికి బిజినెస్ లేదా ఫేమస్ క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉండగా.. దానిని ఇప్పుడు యూజర్లందరికి అందుబాటులోకి తెస్తూ ఇన్‎స్టా్గ్రామ్‎ నిర్ణయం తీసుకుంది. ఎన్‌హాన్సెడ్ ట్యాగ్స్ అనేది యూజర్లు తమ క్రియేటివ్ భాగస్వాములను లేదా బ్రాండ్లకు క్రెడిట్ ఇవ్వడానికి పర్మిట్ చేస్తుంది. 'ఈ ఫీచర్ క్రియేటర్ల నేమ్ పబ్లిక్ గా డిస్ ప్లే చేస్తుంది. అలాగే సెల్ఫ్-ఐడెంటిఫైడ్ ప్రొఫైల్ కేటగిరీని డిస్ ప్లే చేస్తుంది' అని ఇన్ స్టాగ్రామ్ తన పోస్టులో వెల్లడించింది. దీని వల్ల మేకప్ ఆర్టిస్టులు, కొరియోగ్రాపర్లు, క్రియేటివ్ డైరెక్టర్లు, ఫోటోగ్రాఫర్లు, ఇతర కేటగిరీలు, ఫీచర్ ఇమేజులు స్పష్టంగా కనిపిస్తాయి. ఎన్‌హాన్సెడ్ ట్యాగ్స్ వల్ల ఎవరు మేకప్ ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్ ఎవరు అనేది ఇమేజ్ ను చూసి యూజర్లు గుర్తించవచ్చు. దీని వల్ల యూజర్లకు ప్రొడక్టులు మరియు సర్వీసులు మరింత చేరువవుతాయని ఇన్ స్టాగ్రామ్ ఆలోచిస్తోంది. కొత్త ఫీచర్ గురించి ఇన్ స్టాగ్రామ్ పేర్కొంటూ.. ''క్రియేటివ్ క్రెడిట్, గుర్తింపు అనేది కొత్త అవకాశాలు, ఆర్థిక సాధికారతకు చాలా ముఖ్యం. ఎక్కువ మంది క్రియేటర్లు పరస్పరం సహకరించుకోవడం వల్ల ఇది చాలా ఉపయోకరంగా ఉంటుంది'' అని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ యాప్ ని ఓపెన్ చేసి పైన రైట్ కార్నర్‌లో ఉన్న ‘+’ ఐకాన్‌పై క్లిక్ చేయండి, కొత్త పోస్ట్‌ క్రియేట్ చేసి ‘next’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. పోస్ట్‌కు టైటిల్ రాసిన తర్వాత ‘Tag people’పై క్లిక్ చేయండి. ‘Add tag’పై సెలెక్ట్ చేసి, ట్యాగ్ చేయవలసిన వారి కోసం సెర్చ్ చేయండి. క్రియేటర్ల కేటగిరీని డిస్‌ప్లే చేయడానికి ‘Show profile category (Show Profile Category)’ పై క్లిక్ చేయండి. ‘done’పై క్లిక్ చేయండి

Post a Comment

0 Comments

Close Menu