Ad Code

ఫాస్ట్‌ట్యాగ్‌ వినియోగదారులకు అలర్ట్...!


హైవేలపై ప్రయాణించే సమయంలో టోల్‌ప్లాజాల వద్ద పొడవైన క్యూలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ (ఫాస్టాగ్)ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనివల్ల ప్రయాణీకుల సమయం ఆదా అవడమే కాకుండా టోల్ చెల్లింపు ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది. ఈ కరోనా లాంటి సమయంలో డబ్బులు ఇవ్వడం స్లిప్ తీసుకోవడం లాంటివి లేకుండా కూడా ఈ విధానం పని చేస్తుంది. ఫాస్టాగ్ ను మీ మొబైల్ నుంచి కూడా సింపుల్ గా రీఛార్జ్ చేసుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేస్తున్నప్పుడు పొరపాటు వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఫాస్టాగ్ వినియోగదారులు ఈ కింది విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. Paytm, PhonePe లేదా ఏదైనా ఇతర చెల్లింపు యాప్ నుండి FASTag రీఛార్జ్ చేయడానికి ముందు, మీరు మీ కారు నంబర్‌ను నమోదు చేయాలి. మీరు పొరపాటున మరు నంబర్ ను తప్పుగా నమోదు చేస్తే ఖాతా నుండి డబ్బు విత్ డ్రా చేయబడుతుంది. కానీ రీఛార్జ్ మాత్రం జరగదు. ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేయడానికి ముందు, మీ ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరిగా బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడాలి. రీఛార్జ్ చేయడానికి ముందు వినియోగదారు బ్యాంక్ వివరాలను నమోదు చేయాలి. తప్పుడు వివరాలను నమోదు చేస్తే రీఛార్జ్ రద్దు చేయబడింది. ఇంకా ఖాతా నుంచి డబ్బు కూడా కట్ అవుతుంది. మీ పాత కారును ఎవరికైనా విక్రయిస్తే, ఫాస్ట్‌ట్యాగ్‌ని డియాక్టివేట్ చేయండి. మీరు ఇలా చేయకపోతే, వాహనం మీది కాకపోయినా టోల్ ప్లాజాలో మీ ఖాతా నుండి డబ్బు తీలగించబడుతూ ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌ని రీఛార్జ్ చేయడంలో మీకు ఏదైనా సమస్య ఉంటే.. మీరు NHAI యొక్క హెల్ప్‌లైన్ నంబర్ 1033కి కాల్ చేయవచ్చు. ఫాస్టాగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ఈ హెల్ప్‌లైన్ ప్రారంభించబడింది. ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఫాస్టాగ్‌లో తక్కువ డబ్బు ఉన్నప్పుడు వెంటనే రీఛార్జ్ చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఫాస్టాగ్‌లో రీఛార్జ్ చేయకపోతే.. మీరు టోల్ ప్లాజా ద్వారా వెళ్లడానికి రెట్టింపు చెల్లించాల్సి రావచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu