Ad Code

సూర్యుడి అరుదైన చిత్రాలు !


సూర్యుడి కక్షలోకి పంపించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన`సోలార్ ఆర్బిటార్‌` అద్భుత చిత్రాలను భూమికి పంపించింది. సూర్యుడికి సంబంధించి గతంలో ఎన్నడూ చూడని కోణాలను ఆవిష్కరించింది. మార్చి 26న సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సోలార్ ఆర్బిటార్… మునుపెన్నడూ చూడని సూర్యుడి దక్షిణ ధృవాన్ని చిత్రీకరించింది. భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో మూడో వంతు వరకు దగ్గరగా వెళ్లి 500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకోగలిగింది. అక్కడ `సోలార్ హెడ్జ్‌హాగ్‌` అని శాస్త్రవేత్తలు పేరు పెట్టిన గ్యాస్ గీజర్‌ను కూడా క్యాప్చర్ చేసింది. సూర్యుడి ఫొటోలను ఇంత దగ్గరగా తీయడం ఇదే మొదటిసారని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది.


Post a Comment

0 Comments

Close Menu