Ad Code

భారత రెజ్లర్ గామా పెహల్వాన్ గూగుల్ డూడుల్ !


20వ శతాబ్దపు భారతీయ రెజ్లర్ గులాం మొహమ్మద్ బక్ష్ బట్‌ను స్మరించుకుంటూ గూగుల్ ఈ డూడుల్ సెలబ్రేట్ చేసింది. ఒకప్పటి రెజ్లర్ ది గ్రేట్ గామా. ప్రపంచంలోని అజేయమైన రెజ్లింగ్ ఛాంపియన్. ఈ గూగుల్ డూడుల్‌ను ఆర్టిస్ట్ బృందా జవేరి రూపొందించారు. రింగ్‌లో గామా పెహెల్వాన్ సాధించిన విజయాలను మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతికి సంబంధించి ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణలను గుర్తు చేసుకుంటూ గ్రేట్ గామా జయంతిని జరుపుకుంటారు. రుస్తమ్-ఎ-హింద్ 144వ జయంతిని కూడా పిలుస్తారు. గ్రేట్ గామా అమృత్‌సర్‌ లోని జబ్బోవాల్ గ్రామంలో మల్లయోధుల కుటుంబంలో జన్మించాడు. 10ఏళ్ల వయస్సులోనే వ్యాయామ విద్యలో 500 లంగీలు, 500 పుషప్‌లు చేసేవాడు. 15 ఏళ్లు వచ్చేసరికి రెజ్లర్ క్రీడను ఎంచుకున్నాడు. గూగుల్ ప్రకారం.. 1910 నాటికి గామా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. 1947లో భారతదేశ విభజన సమయంలో అనేక మంది హిందువుల ప్రాణాలను కాపాడినందుకు గామా పెహెల్వాన్ కూడా ఒక హీరోగా అవతరించాడు. 1960లో తాను మరణించే వరకు మిగతా జీవితాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌లో భాగమైన లాహోర్‌లో గడిపాడు. తన కెరీర్‌లో అనేక టైటిళ్లను గెలుచుకున్నాడు. ముఖ్యంగా ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ (1910) ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ (1927), భారతీయ వెర్షన్, టోర్నమెంట్ తర్వాత అతనికి టైగర్ అనే బిరుదు లభించింది. Google ప్రకారం.. బ్రూస్‌లీ కూడా గామాను ఆరాధించాడట.. గామాను చూసి తాను సొంతంగా మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సాధించాడట.

Post a Comment

0 Comments

Close Menu