Ad Code

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు హెచ్చరిక !

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులను స్కామ్‌కు సంబందించిన SMSలు లేదా కాల్‌లకు ప్రతిస్పందించవద్దని PIB SBIని కోరింది. స్కామర్లు యూజర్లకు పంపే టెక్స్ట్ మెసేజ్‌లో షేర్ చేయబడిన ఏ లింక్‌ను కూడా క్లిక్ చేయవద్దని వారికి సూచించబడింది. స్కామర్‌లు తమ అకౌంటును తిరిగి యాక్టీవేట్ చేయడానికి వారి "వ్యక్తిగత" డాక్యుమెంట్లను సమర్పించడానికి ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయమని వినియోగదారులను కోరతారు. ఒకసారి మీరు ఆ లింక్‌పై నొక్కితే కనుక మీరు నకిలీ SBI వెబ్‌సైట్‌కి మళ్లించబడతారు. తద్వారా మీరు ఫిషింగ్ బాధితులవ్వడంతో స్కామర్‌లకు మీ అకౌంట్ నుండి మీ డబ్బును దొంగిలించడానికి అనుమతిస్తుంది. "ప్రియమైన A/c హోల్డర్ SBI బ్యాంక్ డాక్యుమెంట్‌ల గడువు ముగిసింది కావున మీ యొక్క A/c బ్లాక్ చేయబడుతుంది. తిరిగి యాక్టీవేట్ చేయడం కోసం https://sbikvs.II నెట్‌బ్యాంకింగ్ లింక్ ని క్లిక్ చేసి త్వరగా అప్‌డేట్ చేయండి." సారాంశంతో స్కామర్‌లు యూజర్లకు SMS ని పంపుతారు. ముఖ్యంగా మీరు అలాంటి మెసేజ్లపై ప్రత్యేకమైన శ్రద్ధవహించి గమనిస్తే కనుక అది నకిలీదో కాదో మీరు సులభంగా గుర్తించగలరు. స్కామర్‌లు పంపే మెసేజ్ లో వ్యాకరణ దోషాలను కలిగి ఉంటాయి. సాధారణంగా ఇది స్కామ్ అని గుర్తించడానికి మొదటి ఎంపిక అవుతుంది.

Post a Comment

0 Comments

Close Menu