Ad Code

పాస్‌వర్డ్‌ లేకుండానే వెబ్‌సైట్లు, యాప్‌లకు సైన్-ఇన్ ?


ఇంటర్నెట్‌లో వెబ్‌సైట్‌లను, యాప్‌ను యాక్సెస్ చేయాలంటే సైన్-ఇన్  చేయడం తప్పనిసరి. ఒకవేళ పాస్‌వర్డ్‌ త్వరగా గుర్తుకు రాకపోతే సైన్-ఇన్ చేయలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే త్వరలో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలుస్తోంది. సమీప భవిష్యత్తులో వెబ్‌సైట్‌లు, యాప్‌లలో సైన్-ఇన్ చేయడానికి పాస్‌వర్డ్‌లు టైప్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే యూజర్లు తమ అకౌంట్లకు సైన్-ఇన్ చేయడానికి ఫింగర్‌ప్రింట్ వెరిఫికేషన్ వంటివి వాడవచ్చు. డివైజ్‌లు, ప్లాట్‌ఫామ్‌ల అంతటా యూజర్ల కోసం ఈజీ & సెక్యూర్డ్ అథెంటికేషన్ ఆప్షన్స్ అనుమతించే "పాస్‌వర్డ్‌లెస్" సైన్-ఇన్ ప్రమాణాలకు తాజాగా యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు తమ మద్దతును ప్రకటించాయి. ఫిడో అలయన్స్, వరల్డ్ వైడ్ వెబ్ కన్సార్టియం సంస్థలు ఈ పాస్‌వర్డ్‌లెస్ సైన్-ఇన్ స్టాండర్డ్స్ రూపొందించాయి. మరి ఈ పాస్‌వర్డ్‌లెస్ సైన్-ఇన్ స్టాండర్డ్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పాస్‌వర్డ్‌లను మరింత సెక్యూర్, ఎన్‌క్రిప్టెడ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్‌లతో రీప్లేస్ చేయాలని ఫిడో అలయన్స్ కృషి చేస్తోంది. అంటే ఇకపై వెబ్‌సైట్‌లు, యాప్‌లు ఎండ్-టు-ఎండ్ పాస్‌వర్డ్‌లెస్ ఆప్షన్లను అందిస్తాయి. అప్పుడు పాస్‌వర్డ్‌కు బదులుగా యూజర్లు ఫింగర్‌ప్రింట్ వెరిఫికేషన్, ఫేస్ అన్‌లాక్ లేదా డివైజ్ పిన్  ద్వారా సైన్ ఇన్ చేయడం సాధ్యమవుతుంది. "ఈ కొత్త విధానం ఫిషింగ్ అటాక్స్ నుంచి రక్షిస్తుంది. పాస్‌వర్డ్‌లతో పోల్చినప్పుడు సైన్-ఇన్ మరింత సురక్షితంగా ఉంటుంది. పాస్‌వర్డ్-ఓన్లీ స్టాండర్డ్ అనేది వెబ్‌లో అతిపెద్ద సెక్యూరిటీ సమస్యలలో ఒకటి. చాలా పాస్‌వర్డ్‌లను గుర్తు పెట్టుకోవడం యూజర్లకు ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల యూజర్లు అన్నిటికీ ఒకటే పాస్‌వర్డ్ ఉపయోగిస్తారు. ఈ ఒకటే పాస్‌వర్డ్ సైబర్ నేరగాళ్లకు దొరికితే వారు అన్ని ఖాతాలను ఈజీగా టేకోవర్‌లు చేసుకునే ప్రమాదముంది. అంతేకాదు ఐడెంటిటీ దొంగలించే ప్రమాదం లేకపోలేదు. యాపిల్ ప్రకారం, ఈ కొత్త సైన్ ఇన్ స్టాండర్డ్ వెబ్‌సైట్‌లు, యాప్‌లు, డివైజ్‌లు, ప్లాట్‌ఫామ్‌లలోని యూజర్లకు స్థిరమైన, సురక్షితమైన, సులభమైన పాస్‌వర్డ్‌లెస్ సైన్-ఇన్‌లను అందించడానికి అనుమతిస్తుంది. ఈ సపోర్ట్ డిఫరెంట్ సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, వెబ్ బ్రౌజర్‌లతో క్రాస్-ప్లాట్‌ఫామ్‌గా ఉంటుంది. పాస్‌వర్డ్-ఫ్రీ లాగిన్స్ మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా ఉంటాయని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ ఫీచర్‌ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించాయని.. ఇప్పుడు అవి తమ ప్లాట్‌ఫామ్‌లు, సేవలకు దానిని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఫిడో లాగిన్ ప్రాథమికంగా యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని డిజిటల్ అకౌంట్ కోసం వన్-స్టాప్ లాగిన్ టూల్ గా ఉపయోగించడానికి అనుమతిస్తుంది. అంటే సమీప భవిష్యత్తులో, మీరు మీ ఫోన్ 4/6-అంకెల పాస్‌కోడ్, ఫింగర్ ఐడీ లేదా ఫేస్ ఐడీని ఉపయోగించి మీ జీమెయిల్ లేదా అవుట్ లుక్ అకౌంట్ కు సైన్ ఇన్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇదే జరిగితే పాస్‌వర్డ్‌ల వాడే కాలం పూర్తిగా పోతుంది. ఫిడో లాగిన్‌లను పాస్‌వర్డ్-ఫ్రీగా, డివైజ్‌ల ద్వారా మరింత సెక్యూర్ చేయడానికి పబ్లిక్-కీ క్రిప్టోగ్రఫీని ఉపయోగిస్తోంది. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ సేవల కోసం పాస్‌వర్డ్-ఫ్రీ మెకానిజంను ఏకీకృతం చేయడానికి ఇప్పటికే తెరవెనుక పని చేయడం ప్రారంభించాయి. ఇది ఒకటి లేదా రెండేళ్లలో యూజర్లకు అందుబాటులోకి రావచ్చు.

Post a Comment

0 Comments

Close Menu