Ad Code

రోల్ టీవీని విడుదల చేసిన ఎల్‌జీ !


దేశీయ మార్కెట్ లోకి ఎల్‌జీ సరికొత్త టీవీలను విడుదల చేసింది. OLED సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌జీ అభివృద్ధి చేసిన ఈ టీవీలు ఎంతో నాణ్యత కలిగి ఉండి, ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకుంటాయని సంస్థ తెలిపింది. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది LG Signature R OLED టీవీ గురించి. సిగ్నేచర్ R OLED TV, ఇది రోల్ (చుట్టగా చుట్టేయడం) చేయదగిన OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. మనకు స్క్రీన్ అవసరం లేనప్పుడు లేదా టెలివిజన్ దగ్గర లేనప్పుడు కిందనే ఉండే సౌండ్ సిస్టమ్‌లోకి చుట్టేయవచ్చు. సాంకేతికంగా అభివృద్ధి చేసిన ఈ టీవీని చూసి వినియోగదారులు థ్రిల్ అవుతారని సంస్థ ప్రతినిధి తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి అద్భుతమైన సాంకేతికతను తమ ప్రీమియం కస్టమర్ల కోసం తీసుకొచ్చినట్లు ఎల్‌జీ సంస్థ తెలిపింది. 97 అంగుళాల ఈ చుట్ట టీవీ ధర రూ. 75 లక్షలుగా నిర్ణయించింది ఎల్‌జీ సంస్థ. దీనితో పాటుగా..ఇదే తరహా OLED సాంకేతికత వినియోగించి మరికొన్ని ప్రీమియం టీవీలను కూడా భారత వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఎక్కువ ధర వెచ్చించి ‘చుట్ట’ టీవీ కొనుగోలు చేయలేని వినియోగదారులు..తక్కువ ధరలో అదే అనుభూతి పొందేలా G2, Z2, C2 సిరీస్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్‌జీ పేర్కొంది. 42-అంగుళాల నుండి 97-అంగుళాల వరకు పరిమాణాలలో ఈ OLED TVలు అందుబాటులో ఉండనున్నాయి. సాంకేతిక పరంగా ఎంతో ఉన్నతంగా అభివృద్ధి చేసిన ఈ టీవీలలో ఎన్నో అడ్వాన్సడ్ ఫీచర్స్ ఉన్నాయని సంస్థ తెలిపింది.


Post a Comment

0 Comments

Close Menu