Ad Code

యూట్యూబ్ యాడ్స్‌ను బ్లాక్ చేసే షార్ట్ కట్ !


మొదటి రెండు, మూడు నెలలు ఫ్రీ అని యూ ట్యూబ్ వాడే యాడ్స్ ఇస్తూంటాడు. అసలు అన్ని రకాల ఓటీటీలకు సబ్ స్క్రిప్షన్స్ కట్టుకోలేకపోతూంటే ఇప్పుడు యూట్యూబ్ కూడానా అనుకునే పరిస్థితి వచ్చింది. అంత కంటే మంచిది. ఐదు సెకన్ల పాటు వెయిట్ చేసి స్కిప్ యాడ్ రాగానే నొక్కేస్తే సరిపోతుంది కదా అనుకుటున్నారు. కానీ ప్రీమియంకు మారకుండా యూ ట్యూబ్ యాడ్స్ వచ్చినప్పుడల్లా ఐదు సెకన్లు చూసి స్కిప్ చేయాల్సిన పని లేకుండా ఓ షార్ట్ కట్ ఉంది. అదే యాడ్ బ్లాకర్. మొబైల్ లేదా పర్సనల్ కంప్యూటర్‌లో క్రోమ్ లేదా ఎడ్జ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తే, సులభంగా యాడ్ బ్లాకర్‌ని ఉపయోగించవచ్చు. https://chrome.google.com/webstore/detail/adblock-for-youtube/cmedhionkhpnakcndndgjdbohmhepckk ఈ లింక్‌లో యాడ్ బ్లాకర్ ఉంటుంది. అంతే కాకుండా ధర్డ్ పార్టీ యాడ్ బ్లాకర్ యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచిత యాడ్ బ్లాకర్ బ్రౌజర్ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాడ్ బ్లాక్ అండ్ ప్రైవేట్ బ్రౌజర్‌ని డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఇలాంటి ఇతర యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకున్నా యాడ్స్ బ్లాక్ చేసుకోవచ్ు. ఇది సాధారణ బ్రౌజర్, ఇది సైట్‌లలో కనిపించే చాలా ప్రకటనలను బ్లాక్ చేస్తుంది. యూట్యూబ్‌లో  ప్రకటన రహిత అనుభవం కోసం మీరు ఈ బ్రౌజర్‌ని ఉపయోగించుకోవచ్చు. యూ ట్యూబ్ ప్రీమియం కట్టినా ఎలాంటి యాడ్స్ రావు. యూట్యూబ్‌ వీడియోస్‌ను నిరంతరం చూసేవారు... ప్రీమియం కట్టడమే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. యాడ్ బ్లాకర్ వల్ల అదనపు సమస్యలు రావని చెప్పలేమని అంటున్నారు. అయితే అప్పుడప్పుడు యూట్యూబ్ చూసేవారు. మాత్రం యాడ్ బ్లాకర్‌ను ట్రై చేయవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu