Ad Code

ఆస్టెరియా డ్రోన్ ఎగరేసిన ప్రధాని మోదీ


కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ డ్రోన్ మహోత్సవ్ 2022న్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఈవెంట్ మే 28 వరకు జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బెంగళూరుకు చెందిన ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్  సంస్థకు చెందిన డ్రోన్‌ను ఎగరేశారు. ఆస్టెరియా సంస్థకు చెందిన బూత్‌ను సందర్శించారు. డోన్ల ద్వారా ఆస్టెరియా రూపొందిస్తున్న పరిష్కారాల గురించి తెలుసుకున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి భారత్‌ను గ్లోబల్ డ్రోన్ హబ్‌గా మార్చాలనే దృక్పథాన్ని ఆయన పంచుకున్నారు. ఈ విజన్‌ను సాకారం చేసేందుకు భారత ప్రభుత్వం పరిశ్రమకు పూర్తి సహకారం అందిస్తుందని ఆయన మరోసారి తెలిపారు. ఈ ఈవెంట్ ద్వారా మా నెక్స్ట్‌ జనరేషన్ డ్రోన్‌లు, స్కైడెక్, మా డ్రోన్ కార్యకలాపాల ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వం, ఎంటర్‌ప్రైజ్ రంగాల్లో కీలక వ్యక్తులకు, నిర్ణేతలకు ప్రదర్శించడానికి మాకు ఒక గొప్ప అవకాశం లభించింది. పదేళ్ల క్రితం భారతదేశంలో డ్రోన్ రంగంలోకి ప్రవేశించిన కొన్ని సంస్థలలో మేము ఒకరిగా ఉన్నాము. అప్పటి నుంచి మేము బహుళ పరిశ్రమ రంగాలలో ఈ సాంకేతికత డిమాండ్, వినియోగంలో విపరీతమైన వృద్ధిని చూశాము. డ్రోన్ సాంకేతికత ప్రభావం చూపగల కొత్త మార్గాలను అన్వేషించడం కొనసాగిస్తామని ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ కో-ఫౌండర్ నిహార్ వర్తక్ అన్నారు. పరిశ్రమ రంగాల్లో భద్రత, నిఘా, సర్వేయింగ్, ఇన్‌స్పెక్షన్ అప్లికేషన్‌ల కోసం ఆస్టెరియా కఠినమైన, విశ్వసనీయమైన పనితీరుతో నడిచే డ్రోన్‌లను ప్రదర్శించింది. డ్రోన్ యాజ్ ఏ సర్వీస్ సొల్యూషన్స్‌ని అందించే క్లౌడ్-ఆధారిత డ్రోన్ ఆపరేషన్స్ ప్లాట్‌ఫారమ్, స్కైడెక్‌ను కూడా ప్రదర్శించింది. ఆస్టెరియా ఏరోస్పేస్ లిమిటెడ్ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ. ఇది ఫుల్-స్టాక్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ. ఇంటర్నల్ హార్డ్‌వేర్ డిజైన్, సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి ప్రభుత్వం, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్ల కోసం డ్రోన్ సొల్యూషన్స్‌ని అందిస్తోంది. రక్షణ, స్వదేశీ భద్రతకు దీర్ఘకాలిక, నాణ్యత గల విశ్వసనీయ ప్రొడక్ట్స్, సర్వీసెస్ అందించడంలో ఆస్టెరియా విశ్వసనీయ భాగస్వామి. వ్యవసాయం, చమురు, గ్యాస్, ఇంధనం, యుటిలిటీస్, టెలికమ్యూనికేషన్స్, మైనింగ్, నిర్మాణ రంగాలకు డ్రోన్ సేవల్ని అందిస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu