Ad Code

సింగిల్ ట్వీట్‌లో ఫొటో, వీడియో యాడ్ చేయొచ్చు !


ట్విట్టర్ ఇప్పటికే ఎన్నో ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసింది. ఇంకా మరెన్నో ఫీచర్లను లాంచ్ చేసేందుకు ఈ మైక్రో-బ్లాగింగ్ సైట్ కొత్త ఫీచర్లపై పనిచేస్తోందని ఓ లేటెస్ట్ రిపోర్ట్ పేర్కొంది. ఆ రిపోర్ట్ ప్రకారం, అప్‌కమింగ్ ట్విట్టర్ ఆండ్రాయిడ్ వెర్షన్  ఒకే ట్వీట్‌కి ఫొటోలు, వీడియోలు రెండింటినీ అటాచ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. దీనర్థం సింగిల్ ట్వీట్‌లో ఫొటోతో పాటు వీడియో కూడా యాడ్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే సెలబ్రిటీలతో పాటు సామాన్య యూజర్లకు కంటెంట్ షేర్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఫీచర్‌తో పాటు "ట్వీట్ అవార్డ్స్" అనే మరో ఫీచర్‌పై కూడా ట్విట్టర్ వర్క్ చేస్తోంది. ప్రస్తుతం, ప్రతి ట్వీట్‌లో కేవలం నాలుగు ఫొటోలు లేదా ఒక వీడియో మాత్రమే యాడ్ చేయడం కుదురుతుంది. కొత్త ఫీచర్‌తో ఆ మీడియా ఫైల్స్ లిమిట్ అలాగే ఉన్నా... వీడియోలు, ఫొటోలు ఒకేసారి ట్వీట్ చేయడం కుదురుతుంది. 9 టు 5 గూగుల్ కంట్రిబ్యూటర్, ఆండ్రాయిడ్ డెవలపర్ డైలాన్ రౌసెల్ ట్విట్టర్‌లో త్వరలో రానున్న కొన్ని ఫీచర్స్ గురించి వెల్లడించారు. "ట్వీట్ అవార్డ్స్" అనే నయా ఫీచర్ కూడా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు. అయితే ఈ ఫీచర్ వల్ల ప్రయోజనం ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై క్లారిటీ లేదు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమకు నచ్చిన ట్వీట్‌కి అవార్డ్స్ ఇవ్వొచ్చని తెలుస్తోంది. అవార్డ్స్ అనేది ఒక మానిటైజేషన్ పాలసీ అయి ఉండొచ్చని సమాచారం. దీనిద్వారా యూజర్లు డబ్బు సంపాదించడం సాధ్యమవ్వచ్చు. డైలాన్ ప్రకారం, అవార్డ్స్ ఐకాన్ కొత్తగా ట్వీట్ కింద యాడ్ అవుతుంది. యూజర్లు దీనిపై క్లిక్ చేయడం ద్వారా అవార్డ్స్ ఆఫర్ చేయొచ్చు. ఒక ట్వీట్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయో కూడా యూజర్లు తెలుసుకోవచ్చు. ట్విట్టర్ కొత్త "సర్కిల్" ఫీచర్ ఇప్పటికే సెలెక్టెడ్ యూజర్లకు లాంచ్ చేసింది. ఇదొక క్లోజ్డ్ గ్రూప్‌గా వర్క్ అవుతుంది. ట్విట్టర్ ట్వీట్‌లకు స్టేటస్ యాడ్ చేసుకునేలా "స్టేటస్" ఫీచర్‌పై పని చేస్తోందని డైలాన్ రౌసెల్ తెలిపారు. ఈ ఫీచర్ యూజర్ల ప్రొఫైల్‌లో స్టేటస్‌ను కూడా చూపుతుందని స్క్రీన్‌షాట్‌ల ద్వారా ఆయన వెల్లడించారు. ప్రొఫైల్ లేదా ట్వీట్ డిస్కవరీకి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌లో "జాయిన్ స్టేటస్", "డిస్కవర్ స్టేటస్" అనే బటన్‌లు ఉంటాయి. ఇంకా, ట్విట్టర్ "ప్రొనౌన్స్" పేజీని పరిచయం చేయడానికి సిద్ధమైంది. ఇదేలా వర్క్ అవుతుందో తెలియాల్సి ఉంది. రెగ్యులర్ యూజర్లందరికీ ఈ ఫీచర్లు అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. కొన్ని అప్‌కమింగ్ ఫీచర్లను టెస్టింగ్ సమయంలో ట్విట్టర్‌ నిలిపేసే అవకాశం కూడా ఉంది.

Post a Comment

0 Comments

Close Menu