Ad Code

బ్లేడ్‌ - డిజైన్ !


ప్రపంచంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా బ్లేడ్‌ ఒకే డిజైన్ కనిపింస్తుంది. 1904లో ఉత్పత్తి చేయబడింది. మొదటి ఉత్పత్తి సమయంలో 165 బ్లేడ్లు తయారు చేశారు.1901లో బ్లేడ్  ప్రవేశపెట్టబడింది. దీని వ్యవస్థాపకుడు జిల్లెట్. విలియం నికర్సన్ సహాయంతో కింగ్ క్యాంప్ మొదటి బ్లేడ్‌ను తయారు చేశాడు. ఇదే సంవత్సరంలో కింగ్ క్యాంప్ పేటెంట్ పొంది 1904 నుండి దాని ఉత్పత్తిని ప్రారంభించింది. మొదటి బ్యాచ్ ఉత్పత్తిలో 165 బ్లేడ్లను తయారు చేసింది కంపెనీ. బ్లేడ్ తయారైన కాలంలో అది షేవింగ్ కోసం మాత్రమే ఉపయోగించబడింది. అందుకే అందులో ప్రత్యేక డిజైన్లు చేశారు. షేవింగ్ రేజర్‌లో అమర్చుకునేలా డిజైన్లు చేశారు. అందులో మూడు రంధ్రాలు ఉండడం వల్ల బ్లేడ్ షేవింగ్ రేజర్ బాగా ఫిట్ అవడం వల్ల షేవింగ్ లో ఎలాంటి ఇబ్బంది కలగక పోవడంతో పాటు అందులో కదలకుండా ఉండేది. జిల్లెట్ ఇప్పటికే బ్లేడ్, షేవింగ్ రేజర్‌పై పేటెంట్ పొందింది. అందుకే ఇతర కంపెనీలు దానిని ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు, జిల్లెట్ మొదట సృష్టించిన అదే డిజైన్‌ను అనుసరించింది. అనేక దశాబ్దాల తర్వాత కూడా బ్లేడ్ అదే రూపకల్పన కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒక మిలియన్ బ్లేడ్‌లు తయారు చేయబడ్డాయి. అయితే డిజైన్ అలాగే ఉంది. కాలక్రమేణా జిల్లెట్ దాని ఉత్పత్తిలో అనేక మార్పులు చేసింది. బ్లేడ్‌లు, షేవింగ్ రేజర్‌ల ప్రీమియం ఉత్పత్తులను పరిచయం చేసింది. ఇది ఎగువ మధ్యతరగతి ప్రజలలో, ముఖ్యంగా ఉద్యోగస్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.

Post a Comment

0 Comments

Close Menu