Ad Code

రూ.20 వేలకే 4K HDR ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ !


ఫ్లిప్‌కార్ట్‌ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్స్ ఇస్తుంది. టీసీఎల్ కంపెనీకి చెందిన ఇఫాల్కన్ స్మార్ట్ టీవీలపై అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయి. ఇఫాల్కన్ కంపెనీకి చెందిన 4కే హెచ్‌డీఆర్ ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని రూ.20 వేల బడ్జెట్‌లో సొంతం చేసుకోవచ్చు. ఇఫాల్కన్ K61 సిరీస్ స్మార్ట్ టీవీలో 4కే హెచ్‌డీఆర్, మైక్రో డిమ్మింగ్, డాల్బీ ఆడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో అడ్వాన్స్‌డ్ ఆండ్రాయిడ్ ఫీచర్స్ ఉన్నాయి. 7000 పైగా యాప్స్, 7,00,000 పైగా షోస్, సినిమాలు యాక్సెస్ చేయొచ్చు. ఈ స్మార్ట్ టీవీ చూసేవారు థియేటర్ లాంటి అనుభవాన్ని పొందొచ్చని కంపెనీ చెబుతోంది. 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్నాయి. 43 అంగుళాల టీవీ ధర రూ.22,999 కాగా, 50 అంగుళాల టీవీ ధర రూ.31,999. ఇక 55 అంగుళాల టీవీ ధర రూ.32,999 కాగా, 65 అంగుళాల టీవీ ధర రూ.51,999. బ్యాంక్ ఆఫర్లతో 43 అంగుళాల టీవీని రూ.20,000 బడ్జెట్‌లో కొనొచ్చు. టీవీ ఫీచర్స్ చూస్తే ఇందులో 3 హెచ్‌డీఎంఐ పోర్టులు, 1 యూఎస్‌బీ పోర్ట్, 1 ఎథర్నెట్ పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్, వైఫై, ఓ+ గ్రేడ్ ప్యానెల్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో రెండు స్పీకర్స్ ఉంటాయి. స్పీకర్స్ ఔట్‌పుట్ 24వాట్స్ ఉంటుంది. సౌండ్ మోడ్‌లో స్టాండర్డ్, మూవీ, మ్యూజిక్, వాయిస్, గేమ్, స్టేడియం, పర్సనల్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో ర్యామ్ కెపాసిటీ 2జీబీ కాగా స్టోరేజ్ కెపాసిటీ 16జీబీ. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ+ హాట్‌స్టార్ లాంటి యాప్స్ సపోర్ట్ లభిస్తుంది. స్క్రీన్ మిర్రరింగ్ ఫీచర్ ఉంది. యాప్స్ ఇన్‌స్టాల్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ అందుబాటులో ఉంటుంది. క్రోమ్ క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్ బిల్ట్ ఇన్‌గా లభిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ జూన్ 17న ముగుస్తుంది. అప్పట్లోగా ఆఫర్స్ పొందొచ్చు. అన్ని బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై ఆఫర్స్ లభిస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పేటీఎం వ్యాలెట్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొంటే 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu