Ad Code

29 నుంచి శాంసంగ్ గెలాక్సీ F13 సేల్ !


శాంసంగ్ నుంచి గెలాక్సీ F13 సిరీస్ భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్‌ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.11,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ మోడల్‌ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ.11,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. Galaxy F13 4G సపోర్టుతో వస్తుంది. జూన్ 29 నుంచి Samsung.com, Flipkart.com ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో ఫ్లిప్ కార్ట్‌లో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. స్మార్ట్‌ఫోన్ 4GB RAM, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ + 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ రెండు వేరియంట్‌లలో వస్తుంది. 64GB మోడల్ ధర రూ.11,999 ఉండగా, 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999. 1TB వరకు స్టోరేజీ సపోర్టు ఉంటుంది. ICICI బ్యాంక్‌తో భాగస్వామ్యమై రూ. 1,000 ఇన్‌స్టంట్ ఆఫర్ అందిస్తోంది. దీని వల్ల ధర తగ్గుతుంది. తగ్గింపు తర్వాత.. శాంసంగ్ Galaxy F13 64GB ధర రూ. 10,999కి అందుబాటులో ఉంటుంది. 128GB ధర రూ.11,999కి తగ్గుతుంది. స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. శాంసంగ్ Galaxy F13 6.6-అంగుళాల FHD+ డిస్‌ప్లేతో స్లిమ్ బెజెల్స్‌తో ప్రామాణిక 60hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది. Exynos 850 ప్రాసెసర్‌తో పాటు గరిష్టంగా 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చింది. ఈ ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్, 6000mAh బ్యాటరీతో సపోర్టు ఇస్తుంది. కెమెరా ముందు భాగంలో.. ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు 5-MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ కలిగి ఉంది. ముందు భాగంలో.. ఫోన్‌లో 8-MP సెల్ఫీ షూటర్ ఉంది. వీడియో కాల్‌ ఆప్షన్ కూడా ఉంది. Samsung Galaxy F13 ఆటో డేటా స్విచింగ్, అడాప్టివ్ పవర్-సేవింగ్ AI పవర్ మేనేజ్‌మెంట్ మరిన్నింటితో సహా కొన్ని ఆసక్తికరమైన ఫీచర్‌లతో వచ్చింది. ఫోన్ వాటర్‌ఫాల్ బ్లూ, సన్‌రైజ్ కాపర్ నైట్‌స్కీ గ్రీన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండనుంది.

Post a Comment

0 Comments

Close Menu