Mobile Logo Settings

Mobile Logo Settings
image

Search This Blog

Sunday, June 12, 2022

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మోటో జీ42 విడుదల !


మోటొరోలా మోటో జీ42  స్మార్ట్ ఫోన్‌ను బ్రెజిల్‌లో లాంచ్ చేసింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. 6.4 అంగుళాల జీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. బ్లూ, రోజ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ అయింది. మనదేశంలో కూడా మోటో జీ42 త్వరలో లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ జీ-ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉండగా... యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్లస్ ప్రాసెసర్‌ను ఇందులో అందించారు. కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కంపాస్ సెన్సార్లు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొబైల్ పక్కభాగంలో ఉంది. మోటో జీ42 బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 20W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు,  బరువు 174.5 గ్రాములు.

No comments:

Post a Comment

Popular Posts