Ad Code

7000 mAh బ్యాటరీతో టెక్నో పోవా 3 విడుదల !


టెక్నో తన లేటెస్ట్ ఫోన్ టెక్నో పోవా 3 ను అతితక్కువ ధరలో లాంచ్ చేసింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ 7000 mAh పెద్ద బ్యాటరీతో సహా భారీ ఫీచర్లతో దేశీయ  మార్కెట్లో ప్రవేశపెట్ట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క డిజైన్, కెమెరా మరియు ప్రాసెసర్ వంటివి అక్కటుకునే అంశాలు.  ముందుగా టెక్నో పోవా 3 ధర విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 11,499 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చెయ్యబడింది. ఈ ధర 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం నిర్ణయించబడింది. అలాగే, 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. జూన్ 27 నుండి ఈ ఫోన్ సేల్ మొదలువుతుంది మరియు అమెజాన్ ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది. పెద్ద 6.9 ఇంచ్ FHD+ డాట్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంటుంది. ఈ ఫోన్ వేగవంతమైన గేమింగ్ ప్రాసెసర్ Helio G88 శక్తితో పనిచేస్తుంది. అంతేకాదు, దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 5GB వర్చువల్ ర్యామ్ ఫీచర్ ను కూడా జత చేసినట్లు కంపెనీ ప్రకటించింది. టెక్నో పోవా 3 అతిపెద్ద 7000 mAh బ్యాటరీని 33W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 14 గంటల గేమింగ్ సమయాన్ని అందిస్తుందని కూడా టెక్నో పేర్కొంది. కెమెరా పరంగా, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 50MP మైన్ కెమెరాకి జతగా మరొక రెండు కెమరాలు ఉంటాయి మరియు క్వాడ్ LED ఫ్లాష్ కూడా వుంది. సెల్ఫీల కోసం ముందుభాగంలో 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. గేమింగ్ కోసం 4D వైబ్రేషన్ Z-Axiz లీనియర్ మోటార్ మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లను కూడా ఈ ఫోన్ కలిగి వుంది.

Post a Comment

0 Comments

Close Menu