విండోస్ 8.1కి సపోర్టు ఆపేయనున్న మైక్రోసాఫ్ట్ !


మైక్రోసాఫ్ట్ విండోస్ 8.1కి సపోర్టును నిలిపివేయనుంది. విండోస్ 8.1 వెర్షన్‌ని ఉపయోగిస్తున్న యూజర్లు జనవరి 10, 2023 నుంచి కొత్త అప్‌డేట్‌లను అందుకోలేరని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత  విండోస్ 8.1 వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ రిమైండర్‌లను పంపుతోంది. జనవరి 10 తర్వాత, మైక్రోసాఫ్ట్ 365ని రన్ చేస్తున్నట్టయితే.. ఇకపై Office యాప్‌లకు అప్‌డేట్‌లను అందుకోలేరని అంటోంది. అందులోని ఫీచర్లు, సెక్యూరిటీ, ఇతర క్వాలిటీ అప్‌డేట్స్ అని నిలిచిపోనున్నాయి. మైక్రోసాఫ్ట్ 365 ప్రోడక్ట్ అప్‌డేట్‌లను కొనసాగించాలంటే.. Windows 8 లేదా 8.1ని సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్‌కి అప్‌గ్రేడ్ కావాలని సిఫార్సు చేస్తోంది. ఈ మేరకు టెక్ దిగ్గజం తమ సపోర్టు పేజీలో పేర్కొంది. గతంలో జనవరి 12, 2016న Windows 8కి Microsoft సపోర్టు నిలిపివేసింది. పర్ఫార్మెన్స్ లేదా సెక్యూరిటీ పరమైన సమస్యలను ఎదుర్కోకుండా ఉండేందుకు Windows కొత్త వెర్షన్‌కు అప్ గ్రేడ్ కావాలని కంపెనీ వినియోగదారులకు సూచిస్తోంది.

Post a Comment

0 Comments