Ad Code

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో !


ఆపిల్ అందించే ప్రొడక్టుల్లో ఎయిర్ పాడ్స్ ఒకటి. ఇప్పటికే అనేక రకాల జనరేషన్లతో కొత్త ఎయిర్ పాడ్ మోడల్స్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. తమ ప్రొడక్టుల్లో ప్రతి జనరేషన్ అప్‌డేట్‌లో కొత్త ఫీచర్లను అందిస్తోంది. ఆపిల్ నెక్ట్స్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రో ప్రవేశపెడుతోంది. ఈ ఎయిర్ పాడ్స్‌లో ఆరోగ్యకరమైన ఫీచర్లు అనేకం ఉండనున్నాయి. ప్రధానంగా ఆరోగ్య సంబంధమైన ఫీచర్లను ఎక్కువగా అందించనుంది. ఇప్పటికే ఈ ఎయిర్ పాడ్స్ ప్రో ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. అందులో ఒకటి ఆపిల్ హియరింగ్ ఎయిడ్ ఫంక్షన్, మరొకటి హార్ట్ రేట్ డిటెక్షన్. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ యాడ్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది. రాబోయే AirPods ప్రో 2వ జనరేషన్ ఫీచర్లు కూడా లీకయ్యాయి. గత వెర్షన్ల మాదిరిగానే అదే డిజైన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. కొత్త జనరేషన్ ఎయిర్‌ పాడ్స్ ప్రో స్టెమ్‌లెస్ డిజైన్‌తో రానుందని గతంలో నివేదికలు పేర్కొన్నాయి. 52Audio నివేదిక ప్రకారం.. Apple AirPods ఆరోగ్య ఫీచర్లతో రానుంది. శక్తివంతమైన చిప్‌సెట్‌తో ఆపిల్ 2జనరేషన్ ఎయిర్ పాడ్స్ రానున్నాయి. ఆటో-అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, మెరుగైన ఫైండ్ మై ఫంక్షన్‌కు సపోర్టు చేస్తాయి. H1 SoC నుంచి ఇయర్‌బడ్‌లకు కనెక్ట్ అవుతాయని నివేదిక పేర్కొంది. AirPods ప్రో రెండో జనరేషన్‌లో పెద్ద మార్పు ఏమిటంటే.. ఫాస్ట్ ఛార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ని చేర్చనుంది. AirPods ప్రో వినికిడి ఎయిడ్ ఫంక్షనాలిటీతో కూడా రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఇయర్‌ఫోన్‌లను వినికిడి సమస్యకు పరిష్కారంగా కూడా వినియోగించుకోవచ్చు. ఎయిర్‌పాడ్స్ ప్రో (2వ జనరేషన్), బాడీ టెంపరేచర్, హార్ట్ రేటును డిటెక్ట్ చేయడంతోపాటు ఇన్నర్ ఇయర్ డేటాను కూడా ట్రాక్ చేస్తుంది. AirPods Pro 2mf జనరేషన్ స్పేషియల్ ఆడియోకి కూడా సపోర్ట్ చేస్తుంది. USB టైప్-C పోర్ట్‌ను కలిగిన ఛార్జింగ్ ఫొటోను 52Audio షేర్ చేసింది. చివరకు Apple యూజర్లకు ఛార్జింగ్ సమస్యల నుంచి రిలీఫ్ ఇవ్వనుంది. కేస్ స్పీకర్ గ్రిల్స్‌ను కూడా కలిగి ఉంది. మీరు కేస్ నుంచి ఇయర్‌బడ్‌లను తీయనప్పుడు కూడా మ్యూజిక్ ప్లే చేయగలదు. ఇక డిజైన్ విషయానికొస్తే.. ఎయిర్‌పాడ్స్ ప్రో ముందున్న డిజైన్‌ను కలిగి ఉంటుందని అంచనా. అందులో పెద్ద మార్పులేమీ ఉండకపోవచ్చు. కొద్దిపాటి మార్పులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. AirPods ప్రో స్టెమ్ డిజైన్‌తో రానుందని నివేదిక తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu