Ad Code

ఎడమ చేతివాటం - మనస్తత్వం !

కొంత మందికి ఎడమచేతి వాటం ఉంటుంది. అంటే రాయడం నుంచి ప్రతీ పని ఎడమచేతితోనే చేస్తుంటారన్నమాట. ఎడమచేతి వాటం కలిగిన వాళ్లు మరింత స్వతంత్రంగా జీవిస్తారని వీరిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భూమిపై ఉన్న మొత్తం జనాభాలో 5-10% మంది ఎడమచేతి వాటం జనాభా ఉన్నారు. కుడి చేతివాటం వారితో పోల్చితే వీరిలో మద్యపానం అలవాటు మూడు రెట్లు ఎక్కువ. మెదడులో కుడి భాగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీరిలో 4-5 నెలలు ఆలస్యంగా మానసిక పరిపక్వత ఉంటుంది. క్రీడల్లో వీరికి మక్కువ ఎక్కువ. టాప్‌ టెన్నీస్‌ ప్రేయర్లలో 40 శాతం ఎడమచేతివాటం వారే ఉండటం గమనార్హం. 26 మంది యూఎస్ ప్రెసిడెంట్లలో 8 మంది ఎడమచేతి వాటంవారే. 40 యేళ్లు దాటిన మహిళలు గర్భం దాల్చితే పుట్టే పిల్లల్లో 128 శాతం ఎడమచేతి వాటం ఉన్న శిశువులు జన్మిస్తున్నారు. కుడి చేతివాటం వాళ్లు మాటలు చెప్పడంలో మేటి. అయితే ఎడమచేతివాటం వారు గణితం, అర్కిటెక్చర్‌లో మరింత ప్రతిభావంతులు. అమెరికా మొత్తం జనాభాలో 30 మిలియన్ల ప్రజలు ఎడమచేతి వాటంవారే ఉన్నారు. కుడి చేతి వాటం వారితో పోల్చితే ఎడమ చేతివాటం వారు అలర్జీ, ఆస్తమా వ్యాధుల భారీన ఎక్కువగా పడుతుంటారు. బ్రిటీష్ రాజ కుటుంబంలో ఎడమ చేతివాటం కలిగిన రాణులున్నారు. క్వీన్ మదర్, క్వీన్ ఎలిజబెత్ II, ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ విలియం వీరంతా ఎడమచేతివాటం కలిగినవారే. వీరిలో నిద్రలేమి సమస్య ఎక్కువ. ఆగస్టు 13న International Left-Handers Dayగా జరుపుకుంటారు. నెర్వస్ అండ్‌ మెంటల్‌ డిసీజ్‌ జర్నల్‌ అధ్యయనాల్లో కుడి చేతివాటం వారి కంటే ఎడమ చేతివాటం కలిగిన వారికి కోపం ఎక్కువ అని తేలింది.

Post a Comment

0 Comments

Close Menu