Ad Code

గూగుల్ కోఫౌండర్ సెర్జెయి బ్రిన్‌ విడాకుల కోసం పిటిషన్‌


గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జెయి బ్రిన్‌ తన జీవిత భాగస్వామి నికోలే షానహన్ నుంచి విడాకులు మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ప్రకారం సెర్జెయి బ్రిన్‌, నికొలే షానహన్ దంపతులకు విడాకులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 2015 నుంచి సహ జీవనం సాగిస్తున్న బ్రిన్‌, షానహన్ జంట 2018 నవంబర్ ఏడో తేదీన ఒక్కటయ్యారు. వారిద్దరికి రెండేండ్ల కూతురు కూడా ఉంది. కానీ మూడేండ్లకే వారి మధ్య విభేదాలు వెలుగు చూశాయి. గతేడాది డిసెంబర్ నుంచి విడివిడిగా ఉంటున్నట్లు కాలిఫోర్నియాలోని శాంతాక్లారాకౌంటీ కోర్టులో సబ్మిట్ చేసిన ఫైలింగ్‌లో తెలిపారు. దంపతులు విడిపోవాలని నిర్ణయించుకున్నా బ్రిన్ మాత్రం తమ కూతురికి జాయింట్ కస్టడీ కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై నికొలే షానహన్ నుంచి మద్దతు కోరలేదని సమాచారం. ఉన్నత స్థాయి ప్రొఫైల్ గల దంపతులు కావడంతో వారి విడాకుల నేపథ్యంలో చిన్నారి కస్టడీ సమస్య వస్తుందని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో వివరించారు. షానహన్‌ను వివాహం చేసుకోకముందు బ్రిన్ 23అండ్‌మీ కోఫౌండర్ అన్నే వోజ్కిక్కీని పెండ్లి చేసుకున్నా 2015లో విడిపోయారు. బ్రిన్‌, వొజిసిక్కీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బ్రిన్ రెండో భార్యగా షానహన్.. బియా ఎచో ఫౌండేషన్ ఫౌండర్‌గా ఉన్నారు. ప్రపంచంలోనే నాలుగో కుబేరుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌- మిలిందా బిల్‌గేట్స్ దంపతుల విడాకుల తర్వాత గూగుల్ సహ వ్యవస్థాపకుడు బ్రిన్ సెర్జెయ్ దంపతులు విడిపోవడం గమనార్హం.

Post a Comment

0 Comments

Close Menu