Ad Code

ఓలా నుంచి ఎలక్ట్రిక్ కారు ?


బెంగళూరు ఈవి స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ ఫోర్ వీల్ ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ తయారీపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ సంస్థ ఈ-స్కూటర్లతో కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది. ఇండియన్ మార్కెట్లోకి తమ బ్రాండ్ నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ S1ను విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ 4-వీలర్ ప్రొడక్షన్‌ను దేశం లో ప్రారంభించేందుకు కృషి చేస్తోంది. జూన్ 19న  ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీలో 'ఓలా కస్టమర్ డే'ని నిర్వహించింది. ఈ సందర్భంగా కొత్త 'MoveOS 2' ఆపరేటింగ్ సిస్టమ్‌ను రిలీజ్ చేసింది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యూజర్లకు మరిన్ని ఫీచర్లు అందించేలా దీన్ని డిజైన్ చేశారు. ఈ ఈవెంట్ సందర్భంగా రాబోయే రోజుల్లో లాంచ్ చేయనున్న ప్రొడక్ట్స్‌కు సంబంధించి ఓలా ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ సెడాన్ తయారీపై దృష్టి సారిస్తోందని వీడియో ద్వారా గుర్తించవచ్చు. ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ ఈ కారు డిజైన్ మాక్-అప్స్‌ గురించి ట్వీట్ చేశారు. ఈ కారు ఫోటోలను గమనిస్తే.ఎక్స్‌టీరియర్ డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. ఫ్రంట్ వీల్స్ హబ్స్ వద్ద ఓలా బ్యాడ్జ్‌ ఉన్నట్లు ఫోటోల్లో కనిపిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్‌కు నాలుగు ఫ్లష్-ఫిట్టింగ్ డోర్లు, డోర్ హ్యాండిల్స్ లేని ఫినిషింగ్, ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్, బ్లాక్ కలర్ రూఫ్, కారు బాడీ చుట్టూ ఎల్‌ఈడీ లైట్ బార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఓలా నుంచి రానున్న ఈ ఫస్ట్ ఆల్-ఎలక్ట్రిక్ కారులో 70-80 kWh కెపాసిటీతో పెద్ద బ్యాటరీ ఉంటుంది. S1, S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగానే ఈ ఎలక్ట్రిక్ కారు కూడా మంచి రేంజ్ ఇవ్వాలని బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది. ధరల పరంగా చూస్తే.. ఓలా ఎలక్ట్రిక్ సెడాన్ ధర సుమారు రూ. 25 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హై డ్రైవింగ్ రేంజ్‌తో పాటు ఈ కారు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.


Post a Comment

0 Comments

Close Menu