యాపిల్ కొత్త మ్యాక్‌బుక్ త్వరలో విడుదల కానుంది. జులైలో మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రొను రిలీజ్ చేయనున్నట్లు యాపిల్ ప్రకటించింది. మ్యాక్‌బుక్ ఎయిర్, మ్యాక్‌బుక్ ప్రొను రిలీజ్ చేయనున్నట్లు యాపిల్ ప్రకటించింది. జూలై నుంచే ఇవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. మ్యాక్‌బుక్ ఎయిర్ డిజైన్‌లో చాలా మార్పులు చేయగా, మ్యాక్‌బుక్ ప్రొ డిజైన్‌లో మాత్రం స్వల్ప మార్పులే చేశారు. ఈ రెండూ కొత్తగా రూపొందించిన ఎమ్2 చిప్‌సెట్లతో తయారవడం విశేషం. మ్యాక్‌బుక్ ఎయిర్ (2022) 8జీబీ+256జీబీ ధర రూ.1,19,900, 8జీబీ+512జీబీ ధర రూ.1,49,900గా ఉంది. ఈ రెండింటినీ త్వరలో 24జీబీ+2టీబీకి అప్‌గ్రేడ్ చేస్తామని యాపిల్ తెలిపింది. మ్యాక్‌బుక్ ఎయిర్ మిడ్‌నైట్, స్టార్‌లైట్, స్పేస్ గ్రే, సిల్వర్ కలర్స్‌లో దొరుకుతుంది. ఇది 13.5 అంగుళాల డిస్‌ప్లే, 1.2 కేజీల బరువు కలిగి ఉంటుంది. మ్యాక్‌బుక్ ప్రొ 8జీబీ+256జీబీ ధర రూ.1,29,900, 8జీబీ+512జీబీ ధర రూ.1,49,900గా ఉంది. దీన్ని కూడా 24 జీబీ+2టీబీకి అప్‌గ్రేడ్ చేస్తారు. ఇది 13 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఇది 20 గంటల బ్యాటరీ పవర్ కలిగి ఉంటుందని కంపెనీ చెప్పింది.
జులైలో మార్కెట్లోకి రానున్న మ్యాక్‌బుక్
0
June 07, 2022
Tags