ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో అందుబాటులో ఉన్న ప్రముఖ OTT భాగస్వాముల కంటెంట్ పోర్ట్‌ఫోలియోలను వినియోగించుకునేలా 20-స్క్రీన్ ప్లాట్‌ఫారమ్ అయిన ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్‌ను భారతీ ఎయిర్‌టెల్ గ్రూప్ప్రా రంభించింది. ఇది మొదటి ఇండియన్ మెటావర్స్ మల్టీప్లెక్స్ అని కంపెనీ తెలిపింది. వినియోగదారులు మెటావర్స్ వేదికగా ప్రారంభించిన పార్టీనైట్ మెటావర్స్ ద్వారా మల్టీప్లెక్స్ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సేవలను వినియోగదారులకు పరిచయం చేసేందుకు ప్రస్తుతం ఉచితంగా అందుబాటులో ఉంచారు. OTT ఒరిజినల్ మొదటి ఎపిసోడ్, ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషలలో సినిమాలను Xstream ప్రీమియం సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ నెలకు రూ.149 నుంచి ప్రారంభమవుతుంది. ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ సేవల గురించి ఎయిర్‌టెల్ మార్కెటింగ్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ మాట్లాడుతూ.. 'ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ చక్కటి అనుభూతిని వినియోగదారులకు అందిస్తుంది. ఇది వెబ్ 3.0 యాప్‌లు, ఒరిజినల్ స్టోరీలతోపాటు, భాగస్వాముల నుంచి కంటెంట్‌ను యాక్సెస్ చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. మెటావర్స్ ద్వారా, మేము ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించాలని చూస్తున్నాం. కంటెంట్ ఔత్సాహికులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ఆఫరింగ్‌ను పరిశీలించేందుకు ఉచిత అవకాశం కల్పిస్తున్నాం. సేవలను ఎక్కువ మందికి చేరువచేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నాం.' అని చెప్పారు. సోషల్ ఎంగేజ్‌మెంట్ ప్లాట్‌ఫారం.. ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్ అనేది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ప్లాట్‌ఫామ్‌కు పొడిగింపు. ఇది ఇటీవల ప్రారంభించిన 100 రోజుల్లోనే 2-మిలియన్ సబ్‌స్క్రైబర్ మైలురాయిని సాధించింది. ఎక్స్‌స్ట్రీమ్ మల్టీప్లెక్స్‌ను ఎయిర్‌టెల్ ఇంటిగ్రేటెడ్ మీడియా ఏజెన్సీ ఆఫ్ రికార్డ్ అయిన ఎసెన్స్ క్రియేట్ చేసింది. బ్లాక్‌చెయిన్-పవర్డ్ డిజిటల్ ప్యార్లల్ యూనివర్స్ అయిన పార్టీనైట్ సృష్టికర్త గామిట్రానిక్స్ అభివృద్ధి చేసింది. పార్టీనైట్ (గామిట్రానిక్స్) వ్యవస్థాపకుడు రజత్ ఓజా మాట్లాడుతూ.. 'ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మల్టీప్లెక్స్ అనుభవం అనేది భవిష్యత్తులో మెటావర్స్ అందించనున్న సేవలను కొలిచేందుకు ఒక సాధనంగా భావించవచ్చు. మెటావర్స్ స్కేలబుల్ సందర్భాలలో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం మల్టీప్లెక్స్ సందర్భం ఒకటి. మెటావర్స్‌లో భవిష్యత్తులో మూవీలు, సంగీతం, ప్రత్యక్ష ప్రసార ఈవెంట్‌లు, ప్రీమియం స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ఉంటాయి. బలమైన స్కోప్‌తో పాటు, సోషల్ ఎంగేజ్‌మెంట్‌కు వేదికగా నిలుస్తుంది. కంటెంట్ డెలివరీకి సంబంధించి కొత్త పద్ధతులను అందుబాటులోకి తీసుకువస్తుంది. మెటావర్స్ వినియోగదారులు లీనమై పోయే తరహాలో సేవలను అందించనుంది.' అని చెప్పారు. లాంచ్ సందర్భంగా ఎయిర్‌టెల్ మార్కెటింగ్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ మాట్లాడారు. 'భారతదేశంలో సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రజల ప్రేమ అందరికీ తెలుసు. మెటావర్స్ ద్వారా ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించాలని చూస్తున్నాం. కంటెంట్ ఔత్సాహికులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ఆఫర్‌ను శాంపిల్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాం.' అని తెలిపారు. మెటావర్స్ బాటలో ప్రముఖ కంపెనీలు గామిట్రానిక్స్అ నేది హైదరాబాద్‌లో వర్చువల్ రియాలిటీ , ఆగ్మెంటెడ్ రియాలిటీ స్టార్టప్. ఇది దాని సొంత మెటావర్స్ పార్టీనైట్‌ను నిర్వహిస్తుంది. కంపెనీ తన మెటావర్స్‌ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. సమీప భవిష్యత్తులో దాని సొంత NFTలను విక్రయించడానికి టోకెన్‌ను ఆవిష్కరించాలని యోచిస్తోంది. లైవ్ ఈవెంట్‌లు, ప్రీమియం స్పోర్ట్స్ స్ట్రీమింగ్‌లను హోస్ట్ చేయడానికి భవిష్యత్తులో ఉత్పత్తిని స్కేల్ చేయవచ్చని Gamitronics ఒక ప్రకటనలో తెలిపింది. ఇది Web3.0 టెక్నాలజీల కోసం బీలైన్ చేసిన OTT కంపెనీల సుదీర్ఘ జాబితాను అనుసరిస్తుంద
భారతీ ఎయిర్‌టెల్ మెటావర్స్‌లో మల్టీప్లెక్స్ ప్రారంభం
0
June 15, 2022
Tags