సోషల్ మీడియా యాప్‌లు కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అందులో భాగంగా టెలిగ్రామ్ సోషల్ మీడియా యాప్ కూడా వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది. యువత చాలా వరకు ఈ యాప్ బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యూత్ తాము ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారనే విషయాలు తమ మిత్రులు, లేదా కుటుంబసభ్యులతో పంచుకోవడానికి ఈ టెలిగ్రామ్ బాగా ఉపయోగడుతోంది. అన్నింటికీ మించి ఈ యాప్ దేశీయంగా రూపొందించినది కావడం విశేషం. ఈ క్రమంలో దీని వినియోగం బాగా పెరిగింది. కాగా, తాజాగా టెలిగ్రామ్ యాప్‌లో ఆ సంస్థ ప్రీమియం సర్వీస్ లను లాంచ్ చేసింది. టెలిగ్రామ్ ప్రీమియం సర్వీసులో భాగంగా టెలిగ్రామ్తమ యాప్‌లో మరిన్ని అప్‌డేట్స్ తీసుకువచ్చింది. ప్రీమియం పొందిన సబ్‌స్క్రైబర్లకు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రీమియం వినియోగదారులు టెలిగ్రామ్ యాప్‌లో 4GB వరకు ఫైల్స్‌ను అప్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలోకి మార్పిడి చేసుకోవడానికి వినియోగదారులకు వెసులుబాటు కలగనుంది. అదేవిధంగా ఫైల్స్‌ను చాలా వేగంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ద్వారా యూజర్లకు మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారం ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే ఆ ఫీచర్లు అందనున్నాయి. ఐఫోన్ యూజర్లకు టెలిగ్రామ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.469 గా ఉంది. అదే ఆండ్రాయిడ్ వినియోగదారుల విషయానికి వస్తే కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ధరను ప్రకటించలేదు. ఆండ్రాయిడ్‌పై ప్రీమియం కు సంబంధించి ధరపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ టెలిగ్రామ్ కంపెనీ దేశాల వారీగా విడుదల చేయనుంది. ఒకసారి వినియోగదారుడు సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత రెన్యూవల్ సదుపాయాన్ని కల్పించారు. బ్లాగ్ పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. టెలిగ్రామ్ యాప్ వినియోగదారులు వేగవంతమైన డౌన్‌లోడ్ అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువ డేటా కలిగి ఉన్న ఫైల్స్ ను సైతం ఈ యాప్‌లో వేగంగా డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేయవచ్చు. అంతేకాకుండా పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులు దాదాపు 1000 ఛానెల్స్ వరకు ఫాలో కావచ్చు. దాంతో పాటు 20 చాట్ ఫోల్డర్స్ (ఒక్కో ఫోల్డర్‌లో 200 చాట్స్) క్రియేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన 10 చాట్‌లను పిన్ చాట్ (పిన్ టూ చాట్) చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటితో పాటు ప్రీమియం వినియోగ దారులు తమకు నచ్చిన ముఖ్యమైన 10 స్టిక్కర్లను సేవ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. అలాగే యూజర్లు బయోలో లాంగర్ డిస్క్రిప్షన్‌తో పాటు ముఖ్యమైన లింక్‌లను పేస్ట్ చేసుకోవచ్చు. ఇక GIF ఇమేజ్‌ల విషయానికి వస్తే మనకు నచ్చిన 400 GIF లను ఉపయోగించ వచ్చు. టెలిగ్రామ్ మెసేజింగ్ సర్వీసుల్ని కేవలం మొబైల్ యాప్‌లలోనే కాకుండా మీ ల్యాప్‌టాప్ లేదా పర్సనల్ కంప్యూటర్‌లో కూడా ఉపయోగించవచ్చు.ముందుగా డెస్క్‌టాప్‌లో క్రోమ్, ఫైర్‌ఫాక్స్, లేదా సఫారీ వంటి బ్రౌజర్ల లో టెలిగ్రామ్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. అనంతరం మీకు టెలిగ్రామ్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత కంట్రీ పేరు ఎంపిక చేసుకుని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ కరెక్టేనా కాదా అని మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. దాన్ని ఓకే చేయాలి. అనంతరం మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడ ఎంటర్ చేయడం ద్వారా మీకు వెబ్ బ్రౌజర్‌లో టెలిగ్రామ్ మెసేజ్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.
టెలిగ్రామ్ ప్రీమియం సర్వీసుల విడుదల !
0
June 21, 2022
Tags