Ad Code

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ కి సమాధి కట్టిన ఇంజినీర్‌


మైక్రోసాఫ్ట్ రిటైర్ ప్రకటించిన వెబ్ బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు ఓ దక్షిణ కొరియా ఇంజనీర్ సమాధిని నిర్మించాడు. 1995లో ప్రవేశించిన ఇంటర్నెట్న్ ఎక్స్‌ప్లోరర్ సేవలు ప్రపంచానికి తెలుసు. అయితే, కొంతకాలం క్రితం నుండి అది ఇతర బ్రౌజర్లను డౌన్‌లోడ్ చేసుకోడానికి తప్ప దేనీకీ పనికిరాని స్థితిలోకి వెళ్లిపోవడంతో మైక్రోసాప్ట్ దానికి రిటైర్మెంట్ ప్రకటించింది. ఇక ఈ సమాధి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ది న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, దక్షిణ నగరమైన జియోంగ్జులో ఇంజినీర్ కియోంగ్ జంగ్ సోదరుడు నడుపుతున్న కేఫ్‌లో ఈ సమాధిని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సగటు ఇంటర్నెట్ వేగాన్ని కలిగి ఉన్న దక్షిణ కొరియా. 27 సంవత్సరాల సేవలందించిన ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ ఈ దేశ ప్రజలతో చాలా ముడిపడి ఉంది. అయితే, Internet Explorerకి ఇకపై మద్దతు ఇవ్వబోమని మైక్రోసాఫ్ట్ బుధవారం ప్రకటించిన సందర్భంగా, ఈ సౌత్ కొరియన్ బ్రౌజర్ పట్ల ఇలా అభిమానాన్ని పంచుకున్నాడు. ఇక, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఇప్పుడు బ్లాక్‌బెర్రీ ఫోన్‌లు, డయల్-అప్ మోడెమ్‌లు, పామ్ పైలట్‌ల మార్గంలోకి వెళ్లినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఎక్స్‌ప్లరర్‌ బ్రౌజర్ మరణాన్ని గుర్తుచేసుకోవడానికి అతను సమాధిపై 330 డాలర్లు, అంటే దాదాపు రూ.26 వేలు ఖర్చు చేయడం విశేషం. ఇన్నాళ్ల తన వృత్తి జీవితంలో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌తో ఉన్న సంబంధాన్ని ఇలా తెలియజేసానని కియోంగ్ జంగ్ రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించాడు.

Post a Comment

0 Comments

Close Menu