Ad Code

వాట్సాప్ ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్ !


వాట్సాప్ యూజర్లకు ఎప్పటికప్పుడు తన సేవలను విస్తరిస్తూ వారి నమ్మకాన్ని పొందుతూ వస్తోంది. మార్కెట్లో యూజర్ల అవసరాలకు తగిన విధంగా వాట్సాప్ తన ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ గ్రూపులో నుండి ఎగ్జిట్ అయితే కేవలం గ్రూప్ అడ్మిన్ కి మాత్రమే తెలిసేలా, గ్రూపులోని మిగిలిన సభ్యులకు తెలియకుండా కొత్త ఫీచర్ ను తీసుకురావడానికి వాట్సాప్ ఇప్పటికే ప్రయత్నిస్తోంది. ఇలా ఓ పక్క ఫీచర్ల మీద ఫోకస్ పెడుతూనే పేమెంట్ల రంగంపైనా ఫోకస్ పెట్టింది. వాట్సాప్ తన పేమెంట్ ఫీచర్ ను ఇప్పటికే లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్ వాడుతున్న వారందరికీ వాట్సాప్ పేమెంట్ ఫీచర్ ఆటోమెటిక్ గా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ తో వాట్సాప్ కాంటాక్ట్ లిస్టులోని నెంబర్లకు సులభంగా డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయడానికి వీలుపడుతోంది. అయితే మార్కెట్లో వాట్సాప్ పేమెంట్ కు పెద్దగా ఆదరణ లేదు. దీంతో మార్కెట్లో వాట్సాప్ పేమెంట్ కు డిమాండ్ పెరగాలని ఒక ఆఫర్ తో ముందుకు వచ్చింది. వాట్సాప్ పేమెంట్ ద్వారా పేమెంట్ చేసే వారికి రూ.105 క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. మూడు సార్లు రూ.35ల చొప్పున మూడు నెంబర్లకు వాట్సాప్ పేమెంట్ ద్వారా చేసే పేమెంట్ కు క్యాష్ బ్యాక్ కింద డబ్బులు వస్తాయి. అంటే వాట్సాప్ కాంటాక్ట్ లిస్టుల ఉన్న మూడు వేర్వేరు నెంబర్లకు వేర్వేరు సందర్భంలో వాట్సాప్ పేమెంట్ ద్వారా చేసే చెల్లింపులకు గాను రూ.35ల క్యాష్ బ్యాక్ మూడు సార్లు అందుకుంటారు. అంటే మొత్తంగా రూ.105ల క్యాష్ బ్యాక్ వస్తుందన్న మాట. గతంలో గూగుల్ పే కూడా పేమెంట్ యాప్ ని తీసుకువచ్చిన కొత్తలో క్యాష్ బ్యాక్ ను ఇచ్చేది. అలాగే ఫోన్ పే కూడా క్యాష్ బ్యాక్ ఇవ్వడంతో మార్కెట్లో తక్కువ కాలంలోనే ఎక్కువ పాపులర్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ యాప్ లు క్యాష్ బ్యాక్ లు తగ్గించి, డిస్కౌంట్లు ఇస్తున్నాయి. దీంతో క్యాష్ బ్యాక్ ద్వారా మార్కెట్లోకి దూసుకెళ్లడానికి వాట్సాప్ కొత్తగా ఈ ఆఫర్ ని తెచ్చినట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu