Ad Code

సంవత్సర కాలం పెయిడ్ లీవ్ ప్రకటించిన మీషో


మీషో ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో బాగా పాపులర్ అవుతోంది. మీషో సంస్థ తమ ఉద్యోగులకు అన్‌లిమిటెడ్ లీవ్ పాలసీని ప్రకటించింది. ఉద్యోగులు 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగులకు 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే లభిస్తుంది. మీషో మీకేర్ ప్రోగ్రామ్ ద్వారా 365 రోజుల వరకు పెయిడ్ లీవ్స్ పొందొచ్చు. తమ కుటుంబ సభ్యులు ఎవరైనా క్లిష్టమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, ఇది తరచుగా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం ఉంటే, ఎక్కువకాలం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉంటే ఉద్యోగులు లీవ్ తీసుకోవచ్చు. వ్యక్తిగత అభిరుచులు లేదా లక్ష్యాల కోసం కొంత సమయం తీసుకోవాలని కోరుకునే ఉద్యోగులకు కూడా ఈ విధానం వర్తిస్తుంది. వాళ్లు కూడా 365 రోజుల వరకు పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. ఉద్యోగులు అనారోగ్యంతో ఉన్నా పెయిడ్ లీవ్ తీసుకోవచ్చు. సెలవు కాలంలో పూర్తి జీతం లభిస్తుంది.  అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుల సంరక్షణ కోసం తీసుకున్న సెలవుల కోసం, ఉద్యోగులకు సెలవు సమయంలో జీతంలో 25 శాతం వరకు లభిస్తుంది. పరిహారంతో పాటు, ప్రావిడెంట్ ఫండ్, బీమా, అదనపు మెడికల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. ఒకవేళ నాన్ మెడికల్ కారణాలతో లీవ్ తీసుకుంటే ఆ సెలవులకు జీతం లభించదు.  మీషో మీకేర్ ప్రోగ్రామ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంపూర్ణ శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన కార్యక్రమం. ఈ పాలసీ కింద అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వెల్‌నెస్ కార్యక్రమాలు కూడా ఇందులో కవర్ అయి ఉంటాయి. బెంగళూరుకు చెందిన మీషో సంస్థలో ప్రస్తుతం 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకోవడానికి ఉద్యోగులకు దీర్ఘకాల సెలవులు అవసరమయ్యే సందర్భాలను తాము చూస్తున్నామని, ఉద్యోగులు అనారోగ్యంతో ఉండటం లేదా వారి కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యంతో ఉన్న సందర్భాల్లో ఎక్కువ సెలవులు అవసరం అవుతున్నాయని తాము గుర్తించామని, అందుకే ఈ పాలసీ ప్రకటించామని మీషో సీహెచ్ఆర్‌ఓ ఆషిష్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ ప్రోగ్రామ్ కింద ఉద్యోగులు చురుకుగా పని చేసిన కాలంలో అప్రైజల్ ప్రోగ్రామ్‌కు కూడా అర్హులు అవుతారు. ఉద్యోగులు సెలవు తర్వాత తిరిగి విధుల్లోకి వచ్చినప్పుడు వారు గతంలో ఏ హోదాలో పనిచేశారో అదే హోదా లభిస్తుంది. ఒకవేళ ఆ హోదా అందుబాటులో లేకపోతే అదే స్థాయి హోదా ఉన్న ఉద్యోగం ఇస్తారు.

Post a Comment

0 Comments

Close Menu