Ad Code

వాట్సాప్ మరిన్ని ఎమోజీలు...!


వాట్సాప్  యూజర్ ఎక్స్‌రియన్స్‌ను మరింత అద్భుతంగా మార్చేందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. వాట్సాప్ ఈ సంవత్సరం ప్రారంభంలో వినియోగదారులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మెసేజ్‌లకు రియాక్ట్‌ అయ్యే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ మెసేజ్ రియాక్షన్స్ కోసం మరిన్ని ఎమోజీలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ఫీచన్‌ను అప్‌డేట్‌ చేస్తోంది. వాట్సాప్‌ ట్రాకర్ WABetaInfo రిపోర్ట్ ప్రకారం.. వాట్సాప్‌లో మెసేజ్‌లకు రియాక్ట్‌ అయ్యేందుకు మరిన్ని ఎమోజీలను తీసుకురావడానికి కంపెనీ పని చేస్తోంది. ఆండ్రాయిడ్ కోసం వాట్సాప్‌ బీటా ఇప్పటికే అన్ని ఎమోజీలకు మెసేజ్ రియాక్షన్‌లను పొందింది. ఇప్పుడు iOSలో వాట్సాప్‌ మెసేజ్‌లకు మరిన్ని ఎమోజీల ద్వారా రియాక్ట్‌ అయ్యే అవకాశాన్ని కల్పించేందుకు కంపెనీ పని చేస్తోంది. వాట్సాప్, iOS బీటాలో సేమ్‌ రిఫరెన్స్‌లను WABetaInfo పేర్కొంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం వాట్సాప్‌ పరీక్షిస్తోందని, రాబోయే అప్‌డేట్‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని WABetaInfo నివేదిక పేర్కొంది. ప్రస్తుతం వాట్సాప్‌లో మెసేజ్‌లకు రియాక్ట్‌ కావడానికి రెడ్ హార్ట్, థంబ్స్ అప్‌, స్మైలీ ఎమోజీ, ఆశ్చర్యపడుతున్నట్లు కనిపించే ఎమోజీ, విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఉండే ఎమోజీ, చేతులు కలిపి ఉన్న ఎమోజీ వంటి కొన్ని మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు తమకు కావలసిన ఏదైనా ఎమోజీని ఎంచుకోవడానికి యాప్‌లో ఎమోజీల పక్కన "+" గుర్తు ఉంటుంది. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో వినియోగదారులు ఇప్పటికే చూస్తున్న మెసేజ్ రియాక్షన్స్ తరహాలోనే ఉంటుంది. WABetaInfo షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లలో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ఆఫర్‌ల మాదిరిగానే ఎమోజీలను ఎంచుకునేటప్పుడు రీసెంట్‌ రియాక్షన్స్‌ కాలమ్ కూడా ఉంటుంది. ఉపయోగించాలనుకుంటున్న ఏదైనా ఎమోజీని సులభంగా ఎంచుకుని, సెర్చ్‌ చేసి, డ్రాగ్‌ చేసేలా ఈ విభాగాన్ని వాట్సాప్‌ అభివృద్ధి చేసింది. మెసేజ్‌లకు రియాక్ట్‌ కావడం కోసం, అదనంగా, అదే విభాగంలో ఇటీవల వినియోగించిన ఎమోజీల వరుసను కూడా చూడవచ్చని WABetaInfo నివేదిక పేర్కొంది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఇప్పటికే క్రమ పద్ధతిలో కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తున్న సమయంలో ఈ తాజా అప్‌డేట్‌ రాబోతోంది. సెలక్టెడ్‌ వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫొటోను చూడకుండా నియంత్రించే కొత్త ప్రైవసీ ఫీచర్‌ను ఇటీవలే వాట్సాప్‌ ప్రారంభించింది. అంతకు ముందు వాట్సాప్‌ చాట్‌లు, డేటాను Android నుంచి iOSకి తరలించే సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రూప్ వీడియో కాలింగ్ (Group Video Calling) ఫెసిలిటీకి కూడా వాట్సాప్ మరిన్ని హంగులు దిద్దుతోంది. ఈ క్రమంలోనే మెసేజింగ్ యాప్ ఇప్పుడు వాట్సాప్‌ గ్రూప్ వీడియో కాల్స్ చేసే అడ్మిన్స్‌ కోసం ఓ కొత్త ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫీచర్‌తో వీడియో కాల్ హోస్ట్‌ చేసే యూజర్ కాల్‌లో ఉన్న ఇతర వ్యక్తిని మ్యూట్ (Mute) చేయవచ్చు. అంతేకాదు, కాల్ కొనసాగుతున్నప్పుడు తమ కాల్‌లో పాటిస్పేట్ చేసిన ఇతరులకు వ్యక్తిగతంగా మెసేజ్  పంపవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu